
పశ్చిమ బెంగాల్, ఒడిషాలను వణికించిన అంపన్ తుఫాను టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కూడా కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. దాదా కుటుంబం కోల్‌కతా నగరంలోని బెహాలా ఏరియా పలాషియల్ బంగ్లాలో నివాసం ఉంటోంది.
ఈ నేపథ్యంలో అంపన్ తుఫాను కారణంగా వీరి ఇంటి ఆవరణలో భారీ ఈదురుగాలులు ధాటికి ఓ మామిడి చెట్టు విరిగిపడింది. లాక్‌డౌన్ కారణంగా బయట కూలీలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ చెట్టును దాదానే స్వయంగా మళ్లీ నిలబెట్టాడు.
Also Read:ఐసీసీ ఛైర్మన్ రేసులో గంగూలీ
విరిగిపడిన చెట్టు కొమ్మలకు తాళ్లు కట్టి పూర్వ స్థితికి తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గంగూలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ పెను తుఫాను బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది.
తుపాను తీరం ధాటిన సమయంలో వీచిన భీకరమైన గాలుల ధాటికి, భారీ వర్షాలకు 84 మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, నేలకూలాయి.
Also Read:లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడంటే.. బీసీసీఐ క్లారిటీ
సెల్ టవర్లు కూడా దెబ్బతినడంతో సమాచార వ్యవస్ధ నిలిచిపోయింది. దీంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోడ్లపై నేలకూలిన చెట్లు, స్తంభాలను తొలగిస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో కోల్‌కతా పోలీసుల పనితీరును గంగూలీ ప్రశంసించాడు.