సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు... నిలకడగా ఆరోగ్య పరిస్థితి... రేపు లేదా...

Published : Jan 29, 2021, 09:35 AM IST
సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు... నిలకడగా ఆరోగ్య పరిస్థితి... రేపు లేదా...

సారాంశం

బుధవారం సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు... గంగూలీకి యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించిన వైద్యులు... ఇకపై ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని భరోసా...

బుధవారం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శనివారం ఆసుపత్రి నుంచి డిశార్జి చేసే అవకాశం ఉందని తెలిపారు వైద్యులు.

ఇదే నెల మొదటి వారంలో సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. అప్పుడు ఆయన గుండెలో మూడు చోట్ల రక్తం గడ్డ కట్టిందని గుర్తించిన వైద్యులు, వాటిని తొలగించి ఓ స్టంట్లు వేశారు. బుధవారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో మిగిలిన రెండు చోట్ల కూడా స్టంట్లు వేసినట్టు సమాచారం.

ఇకపై ఆందోళన అవసరం లేదని, ఇలాంటి సమస్య మళ్లీ పునరావృత్తం కాదని వైద్యులు చెబుతున్నారు. గంగూలీకి యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించామని తెలిపారు వైద్యులు. సౌరవ్ గంగూలీకి మొదటిసారి సర్జరీ చేసినప్పుడు మరో చోట్ల సమస్య ఉన్నట్టు గుర్తించినా... ఆరోగ్యం నిలకడగా ఉన్న కారణంగా అప్పుడు సర్జరీని వాయిదా వేసినట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?