అయ్య బాబోయ్... ఆఖరికి దినేశ్ కార్తీక్ కూడా... భారత క్రికెటర్ ఇంటికి ప్రత్యేక అతిథి...

Published : Jan 28, 2021, 04:46 PM IST
అయ్య బాబోయ్... ఆఖరికి దినేశ్ కార్తీక్ కూడా... భారత క్రికెటర్ ఇంటికి ప్రత్యేక అతిథి...

సారాంశం

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్.. బెర్నీ సాండర్స్ మీమీని పోస్టు చేసిన దినేశ్ కార్తీక్... సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్...

ప్రస్తుతం మీమీ వరల్డ్‌లో సెనేటర్ బెర్నీ సాండర్స్ మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఈ బెర్నీ సాండర్స్ ట్రెండ్‌ను ఫాలో అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా చేరిపోయాడు.

ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, తన ట్విట్టర్ ఖాతాలో బెర్నీ సాండర్స్ మీమీని పోస్టు చేశాడు...‘ప్రపంచం మొత్తం తిరిగిన తర్వాత, చూడండి ఆఖరికి మా ఇంటికి ఎవరొచ్చారో...’ అంటూ కాప్షన్ పెట్టాడు దినేశ్ కార్తీక్.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో తమిళనాడు జట్టు సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచింది తమిళనాడు. శుక్రవారం రాజస్థాన్‌తో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలబడబోతోంది తమిళనాడు జట్టు.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !