
గబ్బా టెస్టు ఆఖరి రోజు అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను అబ్బా అనిపించే దెబ్బ తీసిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని కాదు... పెళ్లి విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ సొంత ఇంటిని తీసుకోవడానికి వెతుకులాట మొదలెట్టాడట రిషబ్ పంత్.
‘ఎప్పుడైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చానే, అప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కొత్త ఇళ్లు తీసుకోమని వెనకబడుతున్నారు... గురుగ్రావ్ బాగానే ఉంటుందా? లేక వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి...’ అంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్.
దానికి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు... ‘ఓ క్రికెట్ గ్రౌండ్ కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాట్ పఠాన్. పంత్‌ను హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కొమని కొందరు అంటుంటే, ఢిల్లీలో కొనుగోలు చేయాలని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
గబ్బాలో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టిన పంత్, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను కానీ టిమ్ పైన్‌ని గానీ ఈ విషయంలో సలహా అడగాలని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ నిలిచిన విషయం తెలిసిందే.