గంగూలీ కొత్త జట్టును నిర్మించాడు.. కోహ్లి అలా చేశాడా..? ఏమో డౌటే..!సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

By Srinivas MFirst Published May 19, 2022, 6:20 PM IST
Highlights

Sourav Ganguly-Virat Kohli: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ చైర్మెన్ గా ఉన్న  సౌరవ్ గంగూలీతో పోలిస్తే విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఏం సాధించాడని  వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియాకు  సౌరవ్ గంగూలీ చేసిందానితో పోలిస్తే విరాట్ కోహ్లి చేసింది చాలా తక్కువని  భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.  కెప్టెన్ గా గంగూలీ.. కొత్త భారత జట్టును నిర్మించాడని,  కానీ కోహ్లి అలా చేశాడా..? అని ప్రశ్నించాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ వీరూ ఈ వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘సౌరవ్ గంగూలీ కొత్త భారత జట్టును నిర్మించాడు. అతడు జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకురావడమే గాక వాళ్లు ఫామ్ లో లేనప్పుడైనా.. ఉన్నతంగా ఆడినప్పుడైనా వారికి మద్దతుగా నిలిచాడు. విరాట్ కోహ్లి తాను సారథిగా ఉన్నప్పుడు గంగూలీ మాదిరి చేశాడా..? ఏమో నాకు అనుమానంగానే ఉంది..’ అని వ్యాఖ్యానించాడు. వీరూ అక్కడితో ఆగలేదు. 

‘నా అభిప్రాయం ప్రకారం.. నెంబర్ వన్ కెప్టెన్ అనే వ్యక్తి జట్టును నిర్మించడమే గాక ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నమ్మకం కల్పించాలి. కోహ్లి కొంతమంది ఆటగాళ్లకే మద్దతుగా నిలిచాడు.  చాలా మందిని అతడు పట్టించుకోలేదు..’ అని వీరూ తెలిపాడు.

ఈ ఇద్దరూ భారత జట్టుకు గొప్ప కెప్టెన్లే అయినప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. భారత జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత  2002 లో ఐసీసీ నాకౌట్ దశకు వెళ్లింది భారత్. రెండేండ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో  శ్రీలంకతో కలిసి ట్రోపీని పంచుకుంది. 2003 వన్డే ప్రపంచకప్ లో ఫైనల్ కు వెళ్లింది. 

ఐసీసీ ఈవెంట్లలో కోహ్లికి కూడా గొప్ప రికార్డు ఏమీ లేదు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ లో పాక్ చేతిలో భారత్ ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ కు చేరింది. ఇక 2021 లో టీ20 ప్రపంచకప్ లోఅయితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఒకరకంగా కోహ్లి మీదున్న అతిపెద్ద విమర్శ (ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు కప్ కొట్టలేదని) కూడా అదే.. అయితే ఐసీసీ ఈవెంట్లలో ఎలా ఉన్నా టెస్టులలో మాత్రం కోహ్లి.. భారత్ ను జగజ్జేతగా నిలిపాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను రెండు పర్యాయాలు ఓడించడం.. టెస్టులలో చాలాకాలం పాటు టీమిండియాను నెంబర్ వన్ గా నిలపడం వంటి ఘనతలు చాలా ఉన్నాయి. 

ఇక గంగూలీ కూడా ఏం తక్కువ తిన్లేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిందే గంగూలీ అని అంటారు.  గంగూలీ సారథి కాకముందు భారత జట్టులోని  ఏ ఆటగాడినైనా స్లెడ్జింగ్ చేసినా చూసీ చూడనట్టు ఉండేవాళ్లు. కానీ గంగూలీ సారథి అయ్యాక.. ‘మాటకు మాట..’ అనే సిద్ధాంతాన్ని టీమిండియా వంటబట్టించుకుంది. ధోని, వీరూ, ఇర్ఫాన్ పఠాన్ వంటి గొప్ప క్రికెటర్లంతా ధోని హయాం లో టీమిండియాలోకి వచ్చినోళ్లే.. 

click me!