IPL: సామ్సంగ్ తో నాలుగేండ్ల బంధాన్ని తెంచుకున్న ముంబై ఇండియన్స్.. ఎంఐ కొత్త టైటిల్ స్పాన్సర్ ఇదే..

By Srinivas MFirst Published Jan 20, 2022, 12:29 PM IST
Highlights

Mumbai Indians Title Sponsor: 2018 నుంచి సామ్సంగ్ తో ఉన్న బంధాన్ని ముంబై తెంచుకుంది. ఆ జట్టు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న క్రెడిట్ కార్డులు జారీ చేసే ఒక స్టార్టప్.. మూడేండ్ల పాటు ముంబైతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఐపీఎల్ లో ఐదు సార్లు ట్రోఫీ విజేత ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జెర్సీలపై ఇక కొత్త జెర్సీ చూడబోతున్నారు అభిమానులు. గడిచిన నాలుగేండ్లుగా ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్సంగ్ తో ఉన్న బంధాన్ని  ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెంచుకుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి  ముంబై  ఫ్రాంచైజీ ఆటగాళ్లపై ‘Samsung’ కనిపించదు. ఆ స్థానాన్ని 'Slice’ భర్తీ చేయనుంది.  ఇది ఒక  క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థ. మార్కెట్ లో ఇప్పటికే  Slice Cards పేరిట సంచలనాలను సృష్టిస్తున్న ఈ సంస్థ వచ్చే మూడేండ్ల కాలానికి ముంబైతో ఒప్పందం కుదుర్చుకుంది. 

2018 నుంచి సామ్సంగ్ తో ఉన్న బంధాన్ని ముంబై తెంచుకుంది. ఆ జట్టు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న సామ్సంగ్ కాంట్రాక్టు ఈ ఏడాదితో ముగిసింది. దీంతో కొత్త స్పాన్సర్ గా స్లైస్ కార్డ్స్ వచ్చి చేరింది. 2022 నుంచి  మూడేండ్ల కాలానాకి గాను ఆ సంస్థ రూ. 90 కోట్లతో ముంబై తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జెర్సీల మీద వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి  సామ్సంగ్ కు బదులుగా స్లైస్ కనిపించనుంది. 

 

🤝 💙

Read more on our partnership with India's leading credit card challenger 👇https://t.co/4WIQe8q9uy

— Mumbai Indians (@mipaltan)

ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ఒప్పందం కుదుర్చుకోవడం కూడా  ఐపీఎల్ చరిత్రలో అరుదైన విషయమే. గతేడాది నవంబర్ లో  చెన్నై సూపర్ కింగ్స్  సంస్థ.. టీవీఎస్ యూరో గ్రిప్ తో కలిసి  మూడేండ్ల పాటు టైటిల్ స్పాన్సర్ గా ఉండేందుకు గాను రూ. 100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  టీవీఎస్ యూరోగ్రిప్ తర్వాత స్లైస్ దే రికార్డు ఒప్పందం. 

స్లైస్ గురించి.. : ఇది ఒక వెంచర్ క్యాపిటల్ స్టార్టప్. రెగ్యులర్ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కునే భారతీయ యువ కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని వారికి ఆకర్షణీయమైన ఆఫర్లతో క్రెడిట్ కార్డులు అందజేస్తున్నది ఈ సంస్థ.  దేశంలో ప్రతి నెలా సుమారు  2 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నది.  బ్యాంకింగ్ రంగంలో దిగ్గజాలుగా పేరున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తర్వాత దేశంలో ఎక్కువ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న సంస్థ స్లైస్ మాత్రమే.. 

లక్నోకు MY11 circle.. 

ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి ‘మై11  సర్కిల్’ టైటిల్ స్పాన్సర్ గా ఎంపికైంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ  వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గేమ్స్ 24/7  సహ  వ్యవస్థాపకుడు భవిన్ పాండ్యా ఈ విషయమై మాట్లాడుతూ..‘ఐపీఎల్ లో ఓ కొత్త జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’ అని తెలిపాడు. 

click me!