హసన్ అలీ భార్యపై కివీస్ కామెంటేటర్ రొమాంటిక్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Published : Mar 10, 2023, 03:44 PM IST
హసన్ అలీ భార్యపై కివీస్ కామెంటేటర్ రొమాంటిక్ కామెంట్స్..  వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

PSL: ఇటీవలే బాబర్ ఆజమ్ సెంచరీపై  సెటైర్లు వేసిన న్యూజిలాండ్ మాజీ బౌలర్ తాజాగా హసన్ అలీ భార్యపైనా కామెంట్స్ చేశాడు. ఆమె  అందానికి అందరూ...   

పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ భార్య  సమియా అర్జూపై   న్యూజిలాండ్ మాజీ బౌలర్, ప్రస్తుతం  పాకిస్తాన్ సూపర్ లీగ్ లో  కామెంటేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న  సైమన్ డౌల్  రొమాంటిక్ కామెంట్స్ చేశాడు.  ఆమె అందాన్ని వర్ణిస్తూ డౌల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఇటీవల బాబర్ ఆజమ్ సెంచరీ గురించి  మాట్లాడుతూ డౌల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆ చర్చ ఇంకా ముగియకముందే  డౌల్ మరో వివాదాన్ని కోరి తెచ్చుకున్నాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్ఎల్-2023లో భాగంగా  రెండ్రోజుల క్రితం ఇస్లామాబాద్ యూనైటెడ్ - ముల్తాన్ సుల్తాన్స్ మధ్య  మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్  చివరి బంతికి  థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. అసలు గెలవదనుకున్న మ్యాచ్ ను ఇస్లామాబాద్ అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. 

రావల్పిండి వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన  ముల్తాన్ సుల్తాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి  205 పరుగులు చేసింది.   షాన్ మసూద్ (75), టిమ్ డేవిడ్  (60)  లు రాణించారు.  అనంతరం   ఇస్లామాబాద్ పోరాడి విజయాన్ని అందుకుంది. ఆ జట్టులో కొలిమన్ మన్రో (40), షాదాబ్ ఖాన్ (44) తో  పాటు చివర్లో  షహీమ్ అష్రఫ్  (51)  లు  మెరుగైన ప్రదర్శన చేశారు.   19.5 ఓవర్లలో  ఇస్లామాబాద్  8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.  

ఆఖరి బంతి వరకూ  నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ విజయం సాధించిన తర్వాత కెమెరాలన్నీ  డగౌట్ లో ఉన్న సమియా అర్జూ మీద ఫోకస్ పెట్టాయి. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఆమె ఎగిరి గంతేసింది.  తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ స్టన్నింగ్ విక్టరీ కొట్టడంతో  ఆనందం పట్టలేక  ఉక్కిరిబిక్కిరి అయింది.  దీంతో కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేశాయి. 

అదే సమయానికి కామెంట్రీ బాక్స్ లో  ఉన్న సైమన్ డౌల్.. అత్యుత్సాహంతో .. ‘ఆమె గెలిచింది..  ఇక్కడున్న చాలా మంది హృదయాలను కొల్లగొట్టింది.  వావ్, సూపర్. నిజంగా ఇది అద్భుతం...’అని చెప్పిన డౌల్, తర్వాత నాలుక కరుచుకుని ‘అదే.. ఈ విజయం’అని కవర్ చేసుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

కాగా ఈ వీడియోపై  పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు   నెటిజనులు కూడా డౌల్ పై సెటైర్లు వేస్తున్నారు.   కామెంటేటర్ గా ఉంటూ హుందాగా నడుచుకోవాల్సిన వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడమేంటని  కామెంట్స్ చేస్తున్నారు. బాబర్   సెంచరీ విషయంలో కూడా డౌల్ ఇలాగే తలాతోక లేని మాటలు మాట్లాడాడని,  ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంటే మహిళల అందాల గురించి పొగడటమేంటని ప్రశ్నిస్తున్నారు. హసన్ అలీ భార్య సమియా  భారత్ కు చెందిన అమ్మాయేనన్న విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !