
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకునే సమయానికి అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతని సక్సెస్ రేటు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం రోహిత్ శర్మ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో టైటిల్ గెలవడంతో ఫెయిల్ అయిన రోహిత్... ఆటగాళ్లపై ప్రస్టేషన్ చూపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో తొలి రెండు టెస్టుల్లో గెలిచిన రోహిత్ సేన, ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడింది. ఈ పరాజయంతో అహ్మదాబాద్ పిచ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే టాస్ గెలవడంతో ఇవన్నీ ప్రత్యర్థి ఆస్ట్రేలియాకి కలిసి వచ్చాయి...
అహ్మదాబాద్ టెస్టు మొదటి రోజు డ్రింక్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ ఓ పని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, బ్రేక్ సమయంలో డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు...
రోహిత్ శర్మ వెనక నుంచి ఇచ్చిన వాటర్ బాటిల్ అందుకుని పరుగెత్తడానికి ప్రయత్నించిన ఇషాన్ కిషన్, దాన్ని జారవిడిచాడు. తిరిగి వచ్చి దాన్ని అందుకుని పరుగెత్తే సమయంలో కాస్త అసహనానికి గురైన రోహిత్ శర్మ, అతని వీపు మీద కొట్టేందుకు ప్రయత్నించడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...
రోహిత్ శర్మ జోక్‌గా కొట్టేందుకు చూసినా, దీన్ని అభిమానులు మరోలా చూస్తున్నారు. తోటి ప్లేయర్లతో ఎలా నడుచుకోవాలో కెప్టెన్ రోహిత్ శర్మకు తెలియదని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకుముందు బౌలర్ భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ విధంగా రోహిత్ శర్మ కారణంగా చిన్నబుచ్చుకున్నారని పాత వీడియోలు, పోస్ట్ చేస్తూ... మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి మీమ్స్ వైరల్ చేస్తున్నవారిలో ఎక్కువ మంది విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులే కావడం విశేషం..
ఇప్పటికే ఇండోర్ టెస్టు ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అహ్మదాబాద్ టెస్టులోనూ టీమిండియా కష్టాల్లో పడింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో మెరిసి ఐదో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఐదో వికెట్‌కి 208 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన తర్వాత కామెరూన్ గ్రీన్‌ని అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
అదే ఓవర్‌లో అలెక్స్ క్యారీ కూడా డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పటికే 384 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా, ఈజీగా 400+ స్కోరు చేసేలా కనిపిస్తోంది. ఉస్మాన్ ఖవాజా ఇంకా క్రీజులోనే ఉండడంతో 450 మార్కు దాటి 500+ స్కోరు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..