Shweta Sehrawat: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో ఢిల్లీ ప్లేయర్ శ్వేత సెహ్రావత్ తన బ్యాటింట్ తో విధ్వంసం సృష్టించింది. 150 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లతో డబుల్ సెంచరీ (242 పరుగులు) కొట్టింది.
Domestic Senior Women's ODI Trophy: బీసీసీఐ నిర్వహిస్తున్న సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో ఢిల్లీ యంగ్ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ ధనాధన్ ఇన్నింగ్స్ విధ్వంసం సృష్టించింది. కేవలం 150 బంతుల్లోనే 242 పరుగులు చేసింది. తన సంచలన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు బాదింది. అలాగే, మరో ప్లేయర్ ప్రతీక సెంచరీతో అదరగొట్టింది. కేవలం 89 బంతుల్లో 101 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ టీమ్ 400 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
దేశీయ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ-నాగాలాంగ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఢిల్లీ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ 242 పరుగుల ఇన్నింగ్స్ సంచలనం సృష్టించింది. 150 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు డబుల్ సెంచరీ కొట్టడంతో ఢిల్లీ 50 ఓవర్లలో 455 పరుగులు చేసింది. నాగాలాండ్‌ను 55 పరుగులకే కుప్పకూలడంతో ఢిల్లీ జట్టు 400 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
undefined
వింటేజ్ రైడ్ లో రవీంద్ర జడేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !
శ్వేత గతేడాది భారత మహిళల అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచింది. ఇక తాజా ఇన్నింగ్స్లో ప్రతీకా రావల్‌తో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఢిల్లీ మహిళల జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు 21 పరుగుల వద్ద ప్రియా పునియా వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి ప్రతీకా రావల్‌తో కలిసి శ్వేత 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సెంచరీ కొట్టిన ప్రతీక 101 పరుగుల వద్ద ఔటయ్యింది.
ప్రతీక ఔట్ అయిన తర్వాత , తనీషా సింగ్‌తో కలిసి శ్వేత 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తనీషా 38 బంతుల్లో 67 పరుగులు చేసింది. 150 బంతుల్లో 242 పరుగులు చేసిన తర్వాత శ్వేత 50వ ఓవర్‌లో ఔటైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ 25 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాగాలాండ్ మహిళల జట్టు 24.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. నాగాలాండ్ టీమ్ 8 మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో పరుణికా సిసోడియా, హరేంద్ర మధు, ప్రియా మిశ్రా తలో 3 వికెట్లు తీశారు.
T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. ఐసీసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా