Shubman Gill: టీమిండియా రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ పాత పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. గిల్ గతేడాది (2022) డిసెంబర్ 31న తన తదుపరి ఏడాది లక్ష్యాలను పేపర్‌పై రాసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ అధిగమించాడు. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం మినహా గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Shubman Gill: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌కు సంబంధించిన ఓ పాత పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. 2023లో ‘న్యూఈయర్ రెజల్యూషన్స్’ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 2023లో అతడు పెట్టుకున్న టార్గెట్స్‌లో చాలా వరకూ సాధించినట్టు తెలుస్తుంది. గతేదాడి గిల్ ఏ ఏ లక్ష్యాలను పెట్టుకున్నాడు. తాను నిర్ణయించుకున్న లక్ష్యాల్లో ఏన్నింటిలో విజయం సాధించాడో మీరు కూడా ఓ లూక్కేయండి.
2023లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేయాలి.. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ నెగ్గాలి… వరల్డ్ కప్ గెలవాలి.. అంటూ రెజల్యూషన్స్ పెట్టుకున్న నాటి ఫోటోను షేర్ చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ సాధించారు. అదే టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం. ఈ లక్ష్యం మినహా గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో సక్సెస్ అయ్యాడని అతని ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గిల్ గతేడాది (2023) మొదటి నెలలోనే న్యూజిలాండ్‌పై రాణించారు. ఈ తరుణంలో ODI లో డబుల్ సెంచరీ బాదాడు. దీంతో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అలాగే.. గత సంవత్సరం ODIలలో 60 కంటే ఎక్కువ సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20లోనూ గిల్ రాణించారు. సొంతగడ్డ భారత్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడంలో విజయం సాధించాడు.
ఇక IPL లో కూడా గిల్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన గిల్ (890 పరుగులు) ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నారు. అతను ఈ టోర్నమెంట్ సమయంలో మూడు సెంచరీలు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 129 కూడా ఉంది. ఒక్క ఐపీఎల్ సీజన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగుల తర్వాత గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
గిల్ తన పోస్ట్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచకప్ , బాక్సింగ్ డే టెస్టును హైలైట్ చేశాడు. ఈ బ్యాట్స్‌మన్ డెంగ్యూ కారణంగా ప్రపంచ కప్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతను తిరిగి జట్టులో చేరాడు. కానీ, తాను అనుకున్న విధంగా దూకుడు ను కొనసాగించలేకపోయాడు. టెస్ట్ అతని రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ఈ బ్యాట్స్‌మన్ ప్రతి వైఫల్యం నుండి నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది.
గిల్ ఇలా వ్రాశాడు, "2023 ముగుస్తుంది, ఈ సంవత్సరం అనుభవాలు, కొన్ని గొప్ప వినోదం, ఇతర గొప్ప అభ్యాసాలతో నిండి ఉంది. సంవత్సరం ప్రణాళికాబద్ధంగా ముగియలేదు, కానీ మేము మా అనేక లక్ష్యాలను చేరుకున్నామని నేను గర్వంగా చెప్పగలను.. 2024లో మేము మా లక్ష్యాలకు చేరువ అవుతాము. మీరు చేసే ప్రతి పనిలో మీ అందరిప్రేమ బలం లభిస్తాయని నేను ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.
2023 ప్రారంభంలో గిల్ తన కోసం నిర్దేశించుకున్న గోల్స్‌లో 2023లో భారతదేశం తరఫున అత్యధిక సెంచరీలు సాధించడం, ఆరెంజ్ క్యాప్ గెలవడం, ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవడం వంటివి ఉన్నాయి. కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు తమను తాము ఉన్నతంగా చూసుకోవడం కూడా ఇందులో ఉన్నాయి. గిల్ ఈ ఏడాది ఏడు సెంచరీలు సాధించాడు, కోహ్లీ కంటే కేవలం ఒక సెంచరీ తక్కువ, అలాగే..ఐపీఎల్ లొ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగలిగాడు. 2024లో భారత్ అద్భుతంగా ఆరంభించి, దక్షిణాఫ్రికాలో సిరీస్ ఓటమిని తప్పించుకోవాలని చూస్తున్నందున గిల్ కొత్త సంవత్సరంలో టెస్టుల్లో ఆడనున్నాడు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.