Big Bash League 13: బిగ్ బాష్ లీగ్2023లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై విజయం సాధించింది. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున బ్యూ వెబ్‌స్టర్ ,మార్కస్ స్టోయినిస్ తుఫాను ఇన్నింగ్స్ ఆడారు.
Big Bash League 13: బిగ్ బాష్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం నాడు మెల్‌బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మెల్‌బోర్న్ స్టార్స్ అద్భుతమైన ఆటతీరుతో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లలో తన తుఫాను బ్యాటింగ్‌తో అంచనాలను తారుమారు చేశాడు మార్కస్ స్టోయినిస్. తాను ప్రతినిథ్యం వహించిన మెల్ బోర్న్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించి హీరోగా నిలిచారు.
మార్కస్ స్టోయినిస్ విధ్వంసం
గ్లెన్ మాక్స్ వెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ రాగానే బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న స్టోయినిస్ మైదానంలోని నలుదిక్కుల పలు భారీ షార్ట్ కొట్టాడు. స్టోయినిస్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తుఫాను ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
ఇక 19 ఓవర్‌లో స్టోయినిస్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ఓవర్ లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌లో రెండో బంతికి సిక్స్, తర్వాతి బంతికి రెండు పరుగులు సాధించాడు. ఇక మిగిలిన మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాది హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఆయన తన జట్టుకు న్యూ ఇయర్ కానుక బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అతిపెద్ద లక్ష్యాన్ని చేధించిన జట్టుగా మెల్‌బోర్న్ ను నిలిపాడు. ఈ విక్టరీతో మెల్‌బోర్న్‌కు రికార్డు విజయం అందించాడు.
లారెన్స్-వెబ్‌స్టర్ అదిరిపోయే ఇన్నింగ్స్
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్టార్స్‌కు శుభారంభం లభించకపోవడంతో థామస్ రోజర్స్ 8 పరుగులకే అవుటయ్యాడు. అయితే.. దీని తర్వాత డేనియల్ లారెన్స్, వెబ్‌స్టర్ బాధ్యతలు స్వీకరించారు. రెండవ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 26 బంతుల్లో 50 పరుగులు చేసిన తర్వాత లారెన్స్ రనౌట్ అయ్యాడు. అదే సమయంలో వెబ్‌స్టర్ 48 బంతుల్లో 66 పరుగులతో (సిక్స్ ఫోర్లు, రెండు సిక్సర్లు) అజేయంగా నిలిచాడు.
అంతకుముందు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున క్రిస్ లిన్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన లిన్ కేవలం 42 బంతుల్లో 83 పరుగులు చేశాడు. లిన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ 32 బంతుల్లో 56 పరుగులు చేశారు. ఇలా అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.