team india : 2024లో టీమిండియా పాల్గొనే సిరీస్‌లు, టోర్నీల షెడ్యూల్ ఇదే .. గ్యాప్ లేదుగా

By Siva Kodati  |  First Published Dec 31, 2023, 9:58 PM IST

మరికొద్దిగంటల్లో 2023 కాలగర్భంలో కలిసిపోతుంది. సరికొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో 2024కు ప్రపంచం స్వాగతం పలకనుంది. ఇక భారత్‌లో ఒక మతంగా క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్ కూడా కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని దాని అభిమానులు కోరుకుంటున్నారు.


మరికొద్దిగంటల్లో 2023 కాలగర్భంలో కలిసిపోతుంది. సరికొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో 2024కు ప్రపంచం స్వాగతం పలకనుంది. ఇక భారత్‌లో ఒక మతంగా క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్ కూడా కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని దాని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది భారత జట్టు అద్భుతంగా రాణించి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ, కీలకమైన వరల్డ్ కప్‌ను అడుగు దూరంలో కోల్పోవడంతో కోట్లాది మంది అభిమానులను బాధపెట్టింది. విరాట్ , రోహిత్ శర్మల కళ్ల వెంట నీళ్లు రావడం.. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి క్రికెటర్లను ఓదార్చిన ఘటనలను భారతీయులెవ్వరూ ఇప్పట్లో మరిచిపోలేరు. 

ఇకపోతే.. కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టబోతోంది టీమిండియా. 2024లోనూ సిరీస్‌లు, మెగా టోర్నీల్లో మన జట్టు తలపడనుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జూన్‌లో విండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఓటమితో నిరాశలో వున్న అభిమానులకు కానుక ఇవ్వాలని భారత జట్టు గట్టి పట్టుదలతో వుంది. మరి ఈ ఏడాది టీమిండియా ఏ యే జట్లతో , ఏయే సిరీస్‌లలో పాల్గొంటుందో చూస్తే:

Latest Videos

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ 20 సిరీస్ :

  • జనవరి 11న మొహాలీలో తొలి టీ 20
  • జనవరి 14న ఇండోర్‌లో సెకండ్ టీ 20
  • జనవరి 17న బెంగళూరులో థర్డ్ టీ 20

భారత్‌కు రానున్న ఇంగ్లాండ్ జట్టు.. 5 టెస్టుల సిరీస్:

  • జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు - హైదరాబాద్‌
  • ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు - విశాఖపట్నం
  • ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు - రాజ్‌కోట్ 
  • ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు - రాంచీ
  • మార్చి 07 నుంచి 11 వరకు ఐదో టెస్టు - ధర్మశాల

ఏప్రిల్‌- మే: ఇండియన్ ప్రీమియర్ లీగ్

  • జూన్‌: టీ20 ప్రపంచకప్‌ (వెస్టిండీస్‌, యూఎస్‌ఏలో)
  • జులైలో శ్రీలంకలో భారత జట్టు పర్యటన . అక్కడ మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది టీమిండియా.
  • సెప్టెంబరులో భారత్‌కు రానున్న బంగ్లాదేశ్‌. అక్కడ రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనుంది.
  • అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్
  • నవంబర్‌, డిసెంబరులలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది భారత్.  అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
click me!