Latest Videos

Shreyas Iyer : రోహిత్ శర్మ తర్వాత రెండో ప్లేయర్‌గా శ్రేయాస్ అయ్యర్ సరికొత్త రికార్డు..

By Mahesh RajamoniFirst Published May 27, 2024, 2:21 PM IST
Highlights

Shreyas Iyer - IPL 2024 : చెన్నైలోని ఎంఏ  చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హైద‌రాబాద్ టీమ్ పై శ్రేయాస్ అయ్య‌ర్ నాయకత్వంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ గెలిచి ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. ఈ క్ర‌మంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డును శ్రేయాస్ అయ్య‌ర్ స‌మం చేశాడు. 
 

Shreyas Iyer : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసి ఈ సీజ‌న్లో విజేత‌గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి.. ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ లో కావ్య మార‌న్ టీమ్ హైద‌రాబాద్ ఉంచిన 114 పరుగుల టార్గెట్ ను షారూఖ్‌ఖాన్‌ సారథ్యంలోని కేకేఆర్ ఫ్రాంచైజీ 10.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టంతో ఛేదించింది. నైట్ రైడర్స్ తరఫున వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేశారు.

బౌలింగ్ లోనూ మెరిసిన కోల్ క‌తా ప్లేయ‌ర్ల‌లో ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో హైద‌రాబాద్ టీమ్ పూర్తి ఓవ‌ర్లు ఆడ‌కుండానే బ్యాటింగ్ చేయ‌డానికి ఇబ్బందులు ప‌డ‌తూ 18.3 ఓవర్లలో 113 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. గౌతమ్ గంభీర్ త‌ర్వాత కేకేఆర్ కు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ గా శ్రేయాస్ అయ్య‌ర్ మ‌రో ఘ‌త‌న సాధించాడు. అలాగే, మొద‌టిసారి త‌న కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌డంతో పాటు కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఐదవ భారతీయుడు, కెప్టెన్‌గా ఫైనల్‌లో ఆడిన 29 ఏళ్ల‌ ఏకైక కెప్టెన్ గా కూడా రికార్డు సృష్టించాడు.

25 కోట్లు వ‌ర్త్ వ‌ర్మ.. వ‌ర్త్.. ఐపీఎల్‌లో బెస్ట్‌ బాల్ ఇదే.. వీడియో

అలాగే,  ఐపీఎల్ 2024 లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న తర్వాత కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న లెజెండరీ రోహిత్ శర్మ రికార్డును కూడా శ్రేయాస్ అయ్య‌ర్ సమం చేశాడు.
డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్న‌ప్పుడు 2009లో రోహిత్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ త‌ర్వాత 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిల్‌లను అందించాడు. ఇక  శ్రేయాస్ 2015లో ఢిల్లీతో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ త‌ర‌ఫున 14 మ్యాచ్‌లలో 439 పరుగులు చేసినందుకు ఆ సంవత్సరం ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2018 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా గంభీర్ వైదొలిగిన తర్వాత అతను ఐపీఎల్ లో కెప్టెన్సీ అరంగేట్రం చేసాడు. 2020లో డీసీని ఐపీఎల్ ఫైనల్‌కు నడిపించాడు కానీ, టైటిల్ ను అందించ‌లేక‌పోయాడు. కానీ, కేకేఆర్ టీమ్ లోకి వ‌చ్చి కెప్టెన్ గా 2024 లో ఐపీఎల్ టైటిల్ ను త‌మ జ‌ట్టుకు అందించాడు.

IPL 2024 : ఐపీఎల్‌లో హిస్ట‌రీలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ స‌రికొత్త చ‌రిత్ర

click me!