Virat Kohli IPL Records : టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ పరుగుల వరదపారించి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.
Virat Kohli Orange Cap : ఐపీఎల్ 2024 ఘనంగా ముగిసింది. ఫైనల్ పోరులో హైదరాబాద్ ను చిత్తుచేసిన కోల్ కతా మూడో సారి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. అయితే, కప్పు మనదే అంటూ ప్రతి సీజన్ ను మొదలుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్ కాలేకపోయింది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండోసారి ఆరెంజ్ క్యాప్ గెలిచిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ ఘనత సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ 741 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో మరో ప్లేయర్ కూడా నిలవలేదు.
ఐపీఎల్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన మూడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. క్రిస్ గేల్ రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రెండో సారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అలాగే, ఐపీఎల్‌లో 8,000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకోల్పాడు. దీంతో పాటు ఒకే గ్రౌండ్ లో 3 వేలకు పైగా పరుగులు చేసిన రికార్డును కూడా విరాట్ సొంతం చేసుకున్నాడు.
undefined
Orange Cap winner - Virat Kohli 👑
The Man. The Myth. The Legend. pic.twitter.com/MwN5HjtYxS
2016 ఐపీఎల్‌లో విరాట్ తొలిసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో ఏకంగా 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఒక్క సీజన్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. ఐపీఎల్ 2024 ఐపీఎల్‌లో ఏకైక బ్యాట్స్‌మెన్‌గా విరాట్ 700కు పైగా పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెండో అత్యధిక స్కోరర్ గా 583 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ర్యాన్ పరాగ్ 573 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
హర్షల్ పటేల్ అదరగొట్టాడు.. పర్పుల్ క్యాప్ సాధించాడు
ఆదివారం ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి ఉంటే పర్పుల్ క్యాప్ గెలుచుకునేవాడు. కానీ అతను 1 వికెట్ మాత్రమే తీశాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. హర్షల్ 14 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 21 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.