Mitchell Starc : ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసిన కేకేఆర్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టి తన కోసం కేకేఆర్ ఖర్చు చేసిన దాదాపు పాతిక కోట్లు వర్త్ అని నిరూపించాడు.
Mitchell Starc: ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేస్తూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా, మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే, ఈ ఫైనల్ పోరులో కేకేఆర్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి అభిషేన్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ బంతి ఐపీఎల్ లో బెస్ట్ బాల్ అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ దాదాపు రూ.25 కోట్ల రికార్డు ధరతో దక్కించుకోవడంపై విమర్శలు వచ్చాయి.
కానీ, ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్ లు సగానికి చేరుకున్న తర్వాత మిచెట్ స్టార్క్ తన బౌలింగ్ పదను ఎంటో చూపించాడు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత గ్రాండ్ గా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి.. దుమ్మురేపే బౌలింగ్ తో తనపై ఖర్చు చేసిన 25 కోట్లు వర్త్ వర్మ.. వర్త్.. అనేలా చెప్పుకునేలా విమర్శకుల నోళ్లు మూయించాడు. కేకేఆర్ మూడో సారి ఐపీఎల్ టైటిల్ ను సాధించడంలో మిచెల్ స్టార్క్ సేవలు 25 కోట్లకు మించినవనే చెప్పాలి. ఎందుకంటై ఫైనల్ మ్యాచ్ లో భీకర ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ అద్భుతమైన డెలివరీలో క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపాడు. కేకేఆర్ కు మంచి శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఐపీఎల్ బెస్టు బాల్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్న ఆ బాల్ వీడియో మీరు చూసేయండి మరి.. !
undefined
Ball of the season? 👀🤌pic.twitter.com/fnl7oWkhQb
— KolkataKnightRiders (@KKRiders)
ఈ సీజన్ ప్రారంభంలో పెద్దగా వికెట్లు తీసుకోలేకపోయినా.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ కు విజయాలు అందించాడు. ప్లేఆఫ్స్ లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న తొలి ప్లేయర్ గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి అద్భుతమైన బౌలింగ్ తో 17 వికెట్లు తీసుకున్నాడు. క్వాలిఫయర్ 1 మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ లో కీలక వికెట్లు తీసుకుని హైదరాబాద్ దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్ లలో హైదరాబాద్ ఓటమిలో ప్రధాన కారణం మిచెల్ స్టార్క్ తీసుకున్న వికెట్లు.. అది కూడా కీలక సమయంలో జట్టుపై ప్రభావం చూపి ఇతర ప్లేయర్లు బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడటానికి కారణంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
IPL 2024 : ఐపీఎల్‌లో హిస్టరీలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర