Shivam Dube: "ఆ ఘనత మహీ భాయ్ కే.. ఆ విషయంలో తననే ఫాలో అవుతున్నా"

By Rajesh Karampoori  |  First Published Jan 15, 2024, 11:20 PM IST

Shivam Dube: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న జరుగుతున్న T20 సిరీస్‌లో టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబె (Shivam Dube) రాణిస్తున్నాడు. ఈ సిరీస్ లో వరుసగా రెండు అర్ధశతకాలతో దుమ్మురేపుతూ.. టీ20 వరల్డ్ కప్ కు ముందు సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే..తనలో ఉన్న ప్రతిభను వెలికితీసిన ఘనత మహీభాయ్(ఎంఎస్‌ ధోని)కే దక్కుతుందన్నాడు. 


Shivam Dube: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న T20 సిరీస్‌లో (IND vs AFG T20 సిరీస్) భారత స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే దుమ్మురేపుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల దూబెగా పేరొందిన శివమ్‌ ఈ సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేసి.. అందరి చూపు తన  వైపుకు తిప్పుకున్నాడు. ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దూబే మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం శివమ్ మాట్లాడుతూ.. తన విజయాల క్రెడిట్‌ను తన ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇచ్చాడు. తనలో ఉన్న ప్రతిభను వెలికితీసిన ఘనత మహి భాయ్ కే దక్కుతుందన్నాడు. 

మ్యాచ్ అనంతరం ఆల్ రౌండర్ శివమ్ దూబే మాట్లాడుతూ, “నా విజయానికి క్రెడిట్ ఎంఎస్ ధోనీ, సిఎస్‌కెకే చెందుతుంది. నేను ఆడగలనని మహి భాయ్ నాకు నమ్మకం కలిగించారు. నాలో ఆత్మవిశ్వాసం నింపారు. నన్ను భయపడకంటూ.. నాతో ధైర్యాన్నినింపారు.మహీభాయ్ మ్యాచ్ ను ఎలా ముగిస్తారో ..  ఆ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను." అని చెప్పుకోచ్చారు.  అలాగే..  CSK టీమ్ మేనేజ్‌మెంట్ తనపై నమ్మకం ఉంచిందనీ. తాను రాణిస్తానని వారు ఎల్లప్పుడూ నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన తర్వాత, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివమ్ దూబేని తీసుకోనున్నారు. దూబే అద్బుత ప్రదర్శన చూసిన పలు మాజీ క్రికెటర్లు టీమిండియాకు మరో యువరాజ్‌ సింగ్‌ దొరికాడని ప్రశంసిస్తున్నారు. 

Latest Videos

 
తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 172 పరుగుల సవాలుతో కూడిన స్కోరు చేసింది. దీంతో భారత్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగులు చేసి విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా, శివమ్ దూబే 32 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో చివరి మ్యాచ్‌ జనవరి 17న బెంగళూరులో జరగనుంది.

click me!