జ‌ట్టులో చోటు దక్కకపోవ‌డంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. గ‌బ్బ‌ర్ కామెంట్స్ వైర‌ల్ !

By Mahesh Rajamoni  |  First Published Jan 16, 2024, 12:55 PM IST

Shikhar Dhawan: టీమిండియా స్టార్ ఓపెన‌ర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఆసియా గేమ్స్‌లో చోటు దక్కకపోవడంపై తొలిసారిగా మౌనం వీడాడు. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత టీమిండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో పాటు టెస్టు మ్యాచ్ లు ఆడకపోవడానికి గల కారణాల‌పై గ‌బ్బ‌ర్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.
 


Shikhar Dhawan: చైనాలోని హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం త‌న‌ను చాలా బాధ క‌లిగించింద‌ని టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడల్లో టీమిండియాకు గ‌బ్బ‌ర్ సార‌థిగా ఉంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ చివ‌రినిమిషంలో రితురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆసియా క్రీడ‌ల్లో టీమిండియా పాలుపంచుకుంది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియా ఓపెనర్‌గా అంద‌రి దృష్టిని ఆకర్షించి.. స్టార్ ఓపెన‌ర్ గా గబ్బర్ ఫేమ్ సాధించాడు. భార‌త్ కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు. అయితే, యంగ్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ రాక తర్వాత టీమ్ లో త‌న స్థానాన్ని కోల్పోయాడు. చివ‌రిసారి 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత ధావన్ జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు.

ప్రపంచంలోనే తొలి క్రికెట‌ర్ గా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

Latest Videos

తాజాగా శిఖ‌ర్ ధావ‌న్ స్పందిస్తూ సెల‌క్ట‌ర్ల తీరుపై విస్మ‌యం వ్య‌క్తంచేశాడు. ఆసియా క్రీడల్లో చోటు దక్కకపోవడంపై బాధ‌ప‌డ్డాన‌ని శిఖర్ ధావన్ వెల్ల‌డించాడు. "బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తాననీ, అయితే నా భవిష్యత్తు గురించి చర్చించేందుకు ఏ సభ్యుడు కూడా నన్ను సంప్రదించకపోవడం బాధగా ఉందని" శిఖర్ ధావన్ అన్నాడు. "ఆసియన్ గేమ్స్‌కు ప్రకటించిన జట్టులో నా పేరు లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ కఠినమైన నిర్ణయం తీసుకుంది. నేను దానిని అంగీక‌రించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేను క‌దా.. ఇప్ప‌టివ‌ర‌కు నా భవిష్యత్తు గురించి నేను ఏ సెలెక్టర్‌తోనూ చర్చించలేదు. నాప‌ని నేను చేస్తున్నాను.. జాతీయ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీఏ)కు వెళుతున్నాను. అక్కడి క్వాలీటీ క్షణాలను నేను చాలా ఆస్వాదించాను. నా క్రికెట్ జీవితాన్ని తీర్చిదిద్దింది.. అందుకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను" అని గ‌బ్బ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అన్నాడు.

టీమిండియా సెల‌క్ష‌న్ క‌మిటీకి బీసీసీఐ షాక్.. ! ఎవ‌రికి మూడిందో మ‌రి.. !

ఇక టెస్టు క్రికెట్ ఆడ‌క‌పోవ‌డం గురించి వివ‌ర‌ణ ఇచ్చిన శిఖ‌ర్ ధావ‌న్.. "నేను చివరిసారిగా 2018లో టీమ్ ఇండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాను. ఆ తర్వాత పూర్తిగా వైట్ బాల్ (వన్ డే, ట్వంటీ20)పై దృష్టి పెట్టాను. అందుకే గత 4-5 ఏళ్లుగా టెస్టు జీవితానికి దూరంగా ఉన్నాను. వయసు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. అందుకే నేను టెస్ట్ క్రికెట్‌కు దూరమయ్యాను. వైట్ బాల్ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాను" అని గ‌బ్బ‌ర్ తెలిపాడు.  టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ రావడం వల్ల కూడా శిఖర్ ధావన్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 187 పరుగులు చేసిన ధావన్, 58 ఇన్నింగ్స్‌లలో 40.61 సగటుతో 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 2315 పరుగులు చేశాడు.

కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?

click me!