టీమిండియా సెల‌క్ష‌న్ క‌మిటీకి బీసీసీఐ షాక్.. ! ఎవ‌రికి మూడిందో మ‌రి.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 16, 2024, 10:34 AM IST

BCCI selection committee: భార‌త క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీలోని ఏ స‌భ్యుని ప‌ద‌వీ కాలం ఇంకా పూర్తి కాలేదు. కానీ, సెల‌క్ట‌ర్ ప‌ద‌వి కోసం బీసీసీఐ నోటిఫికేష‌న్ ఇచ్చింది. సెలెక్టర్ పదవికి ఏడు టెస్టులు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలనీ, దరఖాస్తులను జనవరి 25 వరకు తీసుకుంటామ‌ని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి.
 


India national cricket team: టీమిండియా క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీకి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. భార‌త క్రికెట్ ప్రధాన సెలక్షన్ కమిటీలో మార్పులు చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఎవ‌రికి మూడిందో కానీ, భార‌త క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీలోని ఏ స‌భ్యుని ప‌ద‌వీ కాలం ఇంకా పూర్తి కాలేదు. కానీ, సెల‌క్ట‌ర్ ప‌ద‌వి కోసం బీసీసీఐ నోటిఫికేష‌న్ ఇచ్చింది. అజిత్ అగర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఒక్క స్థానం కూడా ఖాళీగా లేదు. అదే సమయంలో ఏ సభ్యుడి పదవీకాలం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత సెలక్షన్ కమిటీల్లో సెలక్ట‌ర్ కోసం నోటిఫికేష‌న్ ఇవ్వ‌డంతో ఎవ‌రినో బ‌య‌ట‌కు పంపుతార‌నేది హాట్ టాపిక్ అవుతోంది.

బీసీసీఐ జాతీయ సెల‌క్ట‌ర్ ప‌దవి ద‌ర‌ఖాస్తుల గురించి వివ‌రిస్తూ.. సెలెక్టర్ పదవికి ఏడు టెస్టులు, 30 ఫస్ట్ మ్యాచ్ ల‌ను ఆడాల్సి ఉంటుందని తెలిపింది. జనవరి 25 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు 25వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అందిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన దరఖాస్తుదారులను బీసీసీఐ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. ప్రస్తుతానికి ఇంటర్వ్యూకు తేదీని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. 

Latest Videos

సచిన్ టెండూల్క‌ర్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ రియాక్ష‌న్ ఇదే.. !

సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎవరు?

ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. అతని వెంట మాజీ ఓపెనర్ బ్యాట్స్ మ‌న్ శివ సుందర్ దాస్, మాజీ ఫాస్ట్ బౌలర్లు సుబెర్తో బెనర్జీ, సలీల్ అంకోలా, మాజీ బ్యాట్స్ మ‌న్ శ్రీధరన్ శరత్ ఉన్నారు. వీరిలో చీఫ్ సెలెక్ట‌ర్ అగార్కర్ తప్ప ఈ బృందంలోని ఒక‌రిని బీసీసీఐ సాగ‌నంప‌నుంది. 

నార్త్ జోన్ నుంచి సభ్యులు లేరు..

ఇందులో సలీల్ అంకోలా పేరు తెరపైకి వచ్చింది. సెలెక్షన్ కమిటీలో వెస్ట్ జోన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కమిటీలో ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. అగార్కర్ కూడా వెస్ట్ జోన్ కు చెందిన వారే. ఇలాంటి పరిస్థితుల్లో అంకోలా పదవి నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో నార్త్ జోన్ నుంచి ఎవరూ లేరు. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రాంతం నుండి ఒకరిని తీసుకోవ‌చ్చు. అగార్కర్ కంటే ముందు చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు. స్టింగ్ ఆపరేషన్ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

T20 World Cup 2024 లో ఓపెన‌ర్లుగా విరాట్ కోహ్లీ-రోహిత్ శ‌ర్మ ! మరి యంగ్ ప్లేయర్స్

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఆ తర్వాత మూడు టెస్టులకు ఎంపిక జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఐపీఎల్ మధ్యలో టీ20 వరల్డ్ క‌ప్ కు సెలక్టర్లు జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు మ్యాచ్ ల‌ను గెలిచిన భార‌త్ ఇప్ప‌టికే ఈ సిరీస్ ను కైవ‌సం చేసుకోగా, ఈ సిరీస్ లో చివ‌రి మ్యాచ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.

కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?

click me!