Virat Kohli: టీ20, వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ 2000+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ 152 ఇన్నింగ్స్ లలో 65.49 సగటుతో 7794 పరుగులు చేశాడు.
Virat Kohli records: రన్ మిషన్, కింగ్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు నెలకొల్పితూ.. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో మరో అరుదైన రికార్డును సృష్టించాడు. మూడు టీ20ల సిరిస్ లో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్, శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ తో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడటంతో టీమిండియా 15.4 ఓవర్లలో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, 14 నెలల తర్వాత టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు కూడా బాదాడు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
విరాట్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో లక్ష్యాన్ని ఛేదించే (ఛేజింగ్ లో) క్రమంలో రెండు వేల పరుగులు పూర్తి చేశాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా, ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా నిలిచాడు. అతనికంటే ముందు ఐర్లాండ్ కు చెందిన పాల్ స్టిర్లింగ్ ఈ ఘనత సాధించాడు. స్టిర్లింగ్ టీ20ల్లో 83 ఇన్నింగ్స్ లలో 2074 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ 46 ఇన్నింగ్స్ లలో 2012 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టీమిండియా సెలక్షన్ కమిటీకి బీసీసీఐ షాక్.. ! ఎవరికి మూడిందో మరి.. !
టీ20 ఇంటర్నేషనల్‌లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు | |||||
ఆటగాడు | మ్యాచ్ లు | పరుగులు | స్ట్రైక్ రేటు | 100 | 50 |
పాల్ స్టెర్లింగ్ (IRE) | 83 | 2074 | 138.45 | 0 | 14 |
విరాట్ కోహ్లీ (IND) | 51 | 2012 | 136.96 | 0 | 20 |
డేవిడ్ వార్నర్ (AUS) | 61 | 1788 | 141.12 | 0 | 17 |
బాబర్ ఆజం (PAK) | 48 | 1628 | 129.41 | 2 | 14 |
రోహిత్ శర్మ (IND) | 70 | 1465 | 131.86 | 1 | 11 |
వన్డేల్లోనూ తిరుగులేని విరాట్ కోహ్లీ రికార్డులు..
టీ20, వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ 2000+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ 152 ఇన్నింగ్స్ లలో 65.49 సగటుతో 7794 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 27 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 232 ఇన్నింగ్స్ లలో 42.33 సగటుతో 8720 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు | |||||
ఆటగాడు | మ్యాచ్ లు | పరుగులు | సగటు | 100 | 50 |
సచిన్ టెండూల్కర్ (IND) | 236 | 8720 | 42.33 | 17 | 52 |
విరాట్ కోహ్లీ (IND) | 159 | 7794 | 65.49 | 27 | 40 |
రోహిత్ శర్మ (IND) | 147 | 5748 | 49.98 | 15 | 35 |
సనత్ జయసూర్య (SL) | 214 | 5742 | 29.44 | 10 | 30 |
జాక్వెస్ కల్లిస్ (SA) | 169 | 5575 | 44.95 | 5 | 45 |
కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?