ఆ ఇద్దరికీ బీసీసీఐ క్లీన్‌చిట్.. తేలనున్న కపిల్ భవితవ్యం

By Siva KodatiFirst Published Dec 29, 2019, 3:07 PM IST
Highlights

సుప్రీంకోర్టు నియమించిన సలహా కమిటీ మాజీ సభ్యులు శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చింది

సుప్రీంకోర్టు నియమించిన సలహా కమిటీ మాజీ సభ్యులు శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలోని క్రికెట్ సలహా కమిటీ టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి నియమించడంపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

Also Read:కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్: ఈ దశాబ్దం చెత్త ట్వీట్ ఇదే..

రవిశాస్త్రిని తిరిగి నియమించడం ద్వారా కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై రంగంలోకి దిగిన ఎథిక్స్ కమిటీ డీకే జైన్ ముగ్గురికి నోటీసులు పంపారు. దీంతో కపిల్, అన్షుమన్, శాంతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

Also Read:ధోని వారిద్దరికీ మాత్రం తన నిర్ణయం చెప్పే ఉంటాడు : గంగూలీ

దీనితో పాటు మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా జైన్ ఇటీవల మళ్లీ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 27, 28న విచారణ చేపట్టిన కమిటీ శాంతా, గైక్వాడ్‌లు ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు పొందట్లేదని స్పష్టం చేశారు.

అయితే కపిల్‌దేవ్‌కు మాత్రం ఇంకా క్లీన్ చిట్ రాలేదు. ఇందుకు సంబంధించి సంజీవ్ గుప్తా మరో దరఖాస్తు చేయడంతో తుది తీర్పు ఆలస్యం కానుందని డీకే జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

click me!