అంపైర్లతో గొడవకు దిగి వికెట్లు విసిరికొట్టినా... షకీబ్ తప్పేమీ లేదట: వెనకేసుకొచ్చిన భార్య

Arun Kumar P   | Asianet News
Published : Jun 13, 2021, 09:13 AM ISTUpdated : Jun 13, 2021, 09:16 AM IST
అంపైర్లతో గొడవకు దిగి వికెట్లు విసిరికొట్టినా... షకీబ్ తప్పేమీ లేదట: వెనకేసుకొచ్చిన భార్య

సారాంశం

లైవ్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై అసహనంతో వికెట్లను తన్ని ఫిచ్ కేసి కొట్టి వివాదంలో చిక్కుకున్నబంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ ను భార్య ఉమ్మీ అల్ హసన్ వెనకేసుకు వచ్చింది. 

ఢాకా: మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ అతి చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కోపంతో వికెట్లను తన్నడంతో పాటు వాటిని పీకి పిచ్ పై విసిరికొట్టిన షకిబ్ తీరును క్రీడా లోకం తప్పుబడుతోంది. అయితే షకిబ్ భార్య ఉమ్మీ అల్ హసన్ మాత్రం తన భర్త  తప్పేమీ లేదంటూ వెనకేసుకు వస్తోంది. ఆయనపై కొందరు కుట్ర పన్ని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

''ఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్-అబహానీ లిమిటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలపై నాకు అనుమానాలున్నాయి. ఉద్దేశపూర్వకంగానే షకీబల్‌ను విలన్‌లా చూపిస్తున్నారు. ఘటనకు మరోవైపు మాత్రమే చూపించి అసలు విషయాన్ని దాచిపెడుతున్నారు'' అని షకీబ్ భార్య సోషల్ మీడియా వేదికన స్పందించింది. 

ప్రస్తుతం ఢాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న షకీబ్ అల్ హసన్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో తీవ్ర ఆవేశానికి గురై, అంపైర్‌పై తన అసహనాన్ని ప్రదర్శించాడు. బౌలింగ్‌కి వచ్చిన షకీబ్ అల్ హసన్ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశాడు. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో తీవ్ర ఆసహనంతో వికెట్లను కాళ్లతో తన్ని పడగొట్టాడు.

 ఆ తర్వాత కూడా మరో బౌలర్ బౌలింగ్‌లో కూడా అంపైర్ ఇచ్చిన నిర్ణయంతో మండిపడిన షకీబ్ అల్ హసన్, కోపంగా అతని ముందుకొచ్చి వికెట్లను తీసి నేలకేసి కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం కావడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.

ఏ మాత్రం క్రీడాస్ఫూర్తి లేకుండా క్రీజులో అంపైర్‌తో అమర్యాదగా ప్రవర్తించిన షకీబ్ అల్ హసన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఏడాదిపాటు నిషేధానికి గురైన షకీబ్ అల్ హసన్ మరోసారి క్రమశిక్షణారాహిత్యానికి శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది