మనీశ్ పాండేని తొక్కేశారు.. టీమిండియా మేనేజ్మెంట్ పై ఆరోపణలు

Published : Jun 12, 2021, 12:43 PM IST
మనీశ్ పాండేని తొక్కేశారు.. టీమిండియా మేనేజ్మెంట్ పై ఆరోపణలు

సారాంశం

మనీష్‌ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.   

కర్ణాటక స్టార్ బ్యాట్స్ మన్ మనీష్ పాండేను ఎదగకుండా తొక్కేశారని అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ పేర్కొన్నారు. మనీష్ పాండేకు తగినన్ని అవకాశాలు ఇవ్వకుండా.. టీమిండియా మేనేజ్మెంట్ తొక్కేసిందని ఆరోపించారు.

అందరు క్రికెటర్లలాగా మనీష్ కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే.. స్టార్ ప్లేయర్ అయ్యేవాడని ఆయన భావించారు. మనీష్‌ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. 


నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్‌ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్‌, వేగం కలబోసిన టాలెంట్‌ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు.

 కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది