నా కొడుకు కెరీర్ ముగించేశావన్నారు.. యువరాజ్ సింగ్..!

By telugu news teamFirst Published Jun 12, 2021, 12:53 PM IST
Highlights

ఇంగ్లాండ్ పేసర్ సువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువీ.. ఈ సిక్సర్లు కొట్టడం గమనార్హం. ఈ సిక్సర్లతో యూవీ సూపర్ హీరోగా మారిపోయాడు.

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు వినపడగానే.. ఆయన 2007 టీ 20 ప్రపంచకప్ లో ఆడిన వరస ఆరు సిక్సర్ల గురించే ఎవరైనా మాట్లాడుకుంటారు.  యువరాజ్ వరసగా సిక్సర్ల వర్షం కురిపించి ప్రత్యర్థి టీమ్ కి ముచ్చెమటలు పట్టించాడు. అంతేకాకుండా.. తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇంగ్లాండ్ పేసర్ సువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువీ.. ఈ సిక్సర్లు కొట్టడం గమనార్హం. ఈ సిక్సర్లతో యూవీ సూపర్ హీరోగా మారిపోయాడు. అందరూ యూవీ ఆటకి ఫ్యాన్స్ అయిపోయారు. అయితే.. అదే సమయంలో సువర్ట్ బ్రాడ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది.

అతని క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ పోరు సందర్భంగా  బ్రాడ్ తండ్రి, మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్వయంా ఈ విషయమై తనతో మాట్లాడినట్లు యూవీ ఓ సందర్భంలో పేర్కొన్నాడు.

‘‘ ఆసీస్ తో సెమీస్ పోరుకు సువర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ. మ్యాచ్ ముందు క్రిస్ నా దగ్గరకు వచ్చి.. నా కుమారుడి కెరీర్ దాదాపుగా ముగించినందుకు థాంక్యూ అని అన్నాడు. వ్యక్తిగతంగా తీసుకోవద్దు.. నా బౌలింగ్ లోనూ ఐదు సిక్సర్లు కొట్టినవారు ఉన్నారు. ఆ బాధ ఎలా  ఉంటుందో నాకు తెలుసు. అర్థం చేసుకోగలను అని క్రిస్ కి చెప్పాను. ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు ధరించిన జెర్సీని స్టువర్ట్ కి ఇవ్వమని ఆ రోజు క్రిస్ నన్ను అడిగారు. ‘ఇంగ్లాండ్ క్రికెట్ భవిష్యత్తు నువ్వు.. గొప్ప ఘనతలు సాధిస్తావు’ అని జెర్సీ పైరాసి మరీ ఇచ్చాను.’’ అని యూవీ పేర్కొన్నాడు.

ఇప్పుడు స్టువర్ట్ ఎంతో ఎదిగిపోయాడు. టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీశాడు అని యూవీ పేర్కొన్నాడు. 

click me!