గుజరాత్‌ టైటాన్స్ పై కన్నేసిన అదానీ.. పోటీలో మరో గ్రూప్.. అన్ని వేల కోట్లా?

By Mahesh Rajamoni  |  First Published Jul 23, 2024, 2:03 PM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో విక్రయానికి సంబంధించి సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ అదానీ గ్రూప్-టొరెంట్ గ్రూప్‌లతో చర్చలు జరుపుతున్నట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, కొత్త జట్లను వాటాలను విక్రయించకుండా లాక్-ఇన్ టైమ్ 2025 ఫిబ్ర‌వ‌రిలో ముగుస్తుంది.
 


IPL 2025- Adani & Torrent Group : భార‌త వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఇప్పుడు ఐపీఎల్ బ‌రిలోకి దిగుతోంది. దీని కోసం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుపై క‌న్నేసింది. ఆ జ‌ట్టును కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు షురూ చేసింద‌ని ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. సంబంధిత వివ‌రాల ప్ర‌కారం. సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుండి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయనీ, బిలియనీర్ గౌతమ్ అదానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. 

2021 లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని రూ .5,625 కోట్లకు (745 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్, ఐపీఎల్ జట్టు అమ్మకం కోసం అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ రెండింటితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ వాల్యుయేషన్, గ్రోత్ తక్కువగానే ఉన్నప్పటికీ, గుజరాత్ టైటాన్స్ ప్ర‌స్తుత విలుల $1 బిలియన్ నుండి $1.5 బిలియన్ల మధ్య అంచనాలున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా జ‌ట్టు త‌న తొలి సీజ‌న్ లోనే సూప‌ర్ ఫ‌లితాల‌ను సాధించ‌డం.. త‌న మూడు సీజ‌న్ల‌లో మెరుగైన ఫ‌లితాల‌ను అందుకోవ‌డంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే అదానీ గ్రూప్ భారీగానే ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Latest Videos

undefined

కాగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీ) ఐపీఎల్ కొత్త జట్ల విక్ర‌యాలకు సంబంధించి లాక్-ఇన్ పీరియడ్‌ను విధించింది. దీనిని ఫిబ్రవరి 2025 నుంచి ఎత్తివేయ‌నున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు త‌మ వాటాలను విక్రయించడానికి వీలు కల్పిస్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ద్వారా భారత క్రికెట్ లో కొనసాగుతున్న అదానీ గ్రూప్ 2023లో రూ.1,289 కోట్లకు మహిళా టీమ్ గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. 2021లో అదానీ గ్రూప్ రూ.5,100 కోట్ల బిడ్ తో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించగా, టోరెంట్ గ్రూప్ ఫ్రాంచైజీ రూ.4,653 కోట్లు బిడ్ వేసింది. అంతిమంగా సీవీసీ క్యాపిటల్స్ కు చెందిన ఇరేలియా స్పోర్ట్స్ ఇండియా అన్ని పోటీదారులను అధిగమించి జట్టును సొంతం చేసుకుంది.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కొనుగోలుకు సంబంధించి గౌతమ్ అదానీ, సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ మధ్య చర్చలు జరుగుతుండగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ భవిష్యత్తు భారత క్రీడలు, వ్యాపార రంగంలో కేంద్ర బిందువుగా మారింది. అదానీ ఐపీఎల్లోకి ప్రవేశించడమ‌నేది  లీగ్ వాణిజ్య ఆకర్షణను నొక్కి చెప్పడమే కాకుండా, భారతదేశంలో కార్పొరేట్ దిగ్గజాలు, క్రికెట్ ప్రపంచం మధ్య పెరుగుతున్న బంధాన్ని నొక్కిచెబుతోంది. 

click me!