గంగూలీ మెలిక పెట్టినా.... రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న సౌరాష్ట్ర

By Sree sFirst Published Mar 13, 2020, 5:59 PM IST
Highlights

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మధ్య చిన్న సైజు మాటల యుద్ధమే జరిగింది. రంజీ ఫైనల్స్ లో రవీంద్ర జడేజాను సౌరాష్ట్ర తరుఫున ఆడేందుకు అనుమతినివ్వాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గంగూలీని కోరింది. అందుకు గంగూలీ సమ్మతించలేదు.  

 దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీని తొలిసారి కైవసం చేసుకొని సౌరాష్ట్ర చరిత్ర సృష్టించింది. గత దఫాలో ఆఖరుకి మెట్టు వద్ద తత్తరపడ్డ సౌరాష్ట్ర ఈసారి తమ కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ హీరోయిక్స్ తో టైటిల్ ను సొంతం చేసుకుంది. 

సెమీఫైనల్స్ లో గుజరాత్ ను ఒంటి చేత్తో మట్టికరిపించి సౌరాష్ట్రను ఫైనల్స్ లో నిలిపిన కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి విజృంభించడంతో సౌరాష్ట్ర బెంగాల్ పై అద్వితీయమైన విజయాన్ని సొంతం చేయేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ద్వారా ఈ మ్యాచును, టైటిల్ ను సౌరాష్ట్ర ఎగరేసుకుపోయింది. 

ఇక ఈ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మధ్య చిన్న సైజు మాటల యుద్ధమే జరిగింది. రంజీ ఫైనల్స్ లో రవీంద్ర జడేజాను సౌరాష్ట్ర తరుఫున ఆడేందుకు అనుమతినివ్వాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గంగూలీని కోరింది. అందుకు గంగూలీ సమ్మతించలేదు.  

దానిపై స్పందిస్తూ... టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇవ్వలేదని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయదేవ్ షా అసంతృప్తి వ్యక్తం చేసారు. .

జడేజాను సౌరాష్ట్ర తరపున ఆడించాలని భావించిన జయదేవ్.. దాదా అనుమతి కోరారు. అయితే త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండటంతో గంగూలీ అప్పుడు నిరాకరించారు. రంజీ ట్రోఫీ కంటే దేశమే ముఖ్యమని దాదా వ్యాఖ్యానించారు.

Also Read:మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా: 55 బంతుల్లో 158 పరుగులు, శ్రేయస్ రికార్డు బ్రేక్

అయితే దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జయదేవ్.. బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. రంజీ ట్రోఫీ లాంటి మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావాలంటే, ఈ  మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఆయన సూచించారు.

అదే బోర్డు ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించగలదా అని జయదేవ్ ప్రశ్నించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఆదాయం వస్తుందని బోర్డు ఖచ్చితంగా అలా చేయదన్నారు.

టీమిండియా స్టార్ ఆటగాళ్లు కనీసం రంజీ ఫైనల్స్‌లో ఆడినా వాటికి ఆదరణ పెరుగుతుందని, ఈ విషయాన్ని కాస్త ఆలోచించాలన్నాడు. రంజీ ఫైనల్స్‌లో జడేజా పాల్గొంటే బాగుండేదని, అతనితో పాటు బెంగాల్‌ తరపున మహమ్మద్ షమీ ఆడినా తనకు ఇష్టమేనని జయదేవ్ తెలిపారు.

Also Read:39 బంతుల్లో 105 పరుగులు: రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా

అయితే బెంగాల్, సౌరాష్ట్రల మధ్య తుదిపోరుకు టీమిండియా టెస్ట్ క్రికెటర్లు ఛతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహాలు ఆడారు. పుజారా సౌరాష్ట్ర తరపున, సాహా బెంగాల్ తరపున బరిలోకి దిగారు. 

  ఇక ఈ  మ్యాచులో  సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో బెంగాల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక బెంగాల్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత సౌరాష్ట్ర నామ్ కే వాస్తే ఆడాల్సిన ఆటను ఆడింది. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ అయిపోయిందని ప్రకటించే వరకు ఆడేసి... ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉండడంతో సౌరాష్ట్ర విజేతగా నిలిచింది.   

click me!