అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టిన సాయి సుద‌ర్శ‌న్.. మ‌రో సరికొత్త రికార్డు

By Mahesh Rajamoni  |  First Published Dec 18, 2023, 10:47 AM IST

Sai Sudharsan: జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల భార‌త ప్లేయ‌ర్ సాయి సుదర్శన్ అరంగేట్రం చేయ‌డంతో పాటు మరో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 
 


Sai Sudharsan Half Century: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు చాలా అద్భుతంగా ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జొహన్నెస్ బర్గ్ లో జరిగిన ఈ మ్యాచ్ కు భారత బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. అర్ష్‌దీప్ సింగ్ (5 వికెట్లు), అవేశ్ ఖాన్ (4 వికెట్లు) తమ కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ తో దక్షిణాఫ్రికాను దెబ్బ‌కొట్టారు. అదే సమయంలో టీం ఇండియా తరఫున ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఓపెనర్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు సాధించి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ ఫిప్టీతో సాయి సుదర్శన్ ఓ స్పెషల్ క్లబ్ లో చేరాడు. మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

అరంగేట్ర మ్యాచ్ లో అద‌ర‌గొట్టిన సాయి సుద‌ర్శ‌న్..

Latest Videos

22 ఏళ్ల యువ ఓపెనర్ బ్యాట‌ర్ సాయి సుదర్శన్ తన తొలి వన్డే మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 55 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 ఫోర్లు బాదాడు. దీంతో పాటు భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రంలో ఓపెనర్ గా అర్ధసెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్ మ‌న్ గా నిలిచాడు. వీరి కంటే ముందు మరో ముగ్గురు బ్యాట్స్ మెన్ ఈ ఘనత సాధించారు. 

టీమిండియా తరఫున ఓపెనర్ గా అరంగేట్రం చేసి 50+ పరుగులు చేసింది వీరే.. 

86 - రాబిన్ ఊతప్ప వర్సెస్ ఇంగ్లాండ్, 2006
100* - కేఎల్ రాహుల్ వర్సెస్ జింబాబ్వే, 2016
55* - ఫైజ్ ఫజల్ వర్సెస్ జింబాబ్వే, 2016
55* - సాయి సుదర్శన్ వర్సెస్ సౌతాఫ్రికా, 2023* 

మొత్తంగా అరంగేట్రం వన్డేలోనే 55 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించిన 17వ బ్యాట్స్ మన్ గా సాయి సుదర్శన్ నిలిచాడు. అంతకుముందు వన్డే అరంగేట్ర మ్యాచ్లో 16 మంది బ్యాట్స్ మ‌న్ ఆఫ్ సెంచ‌రీలు సాధించారు. కాగా, సాయి సుదర్శన్ ను గుజరాత్ టైటాన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. చెన్నైలో జరిగిన స్థానిక దేశవాళీ టీ20 లీగ్ లో సాయి సుదర్శన్ 8 మ్యాచ్ ల‌లో 143.8 స్ట్రైక్ రేట్ తో 358 పరుగులు చేశాడు.

మొద‌టివ‌న్డేలో భార‌త్ హ‌వా.. 

సౌతాఫ్రికాతో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో భారత బౌలింగ్, బ్యాటింగ్ లో ఆధిపత్యం ప్రదర్శించింది. అర్ష్‌దీప్ సింగ్ (37 పరుగులు - 5 వికెట్లు), అవేష్ ఖాన్ (27 పరుగులు - 4 వికెట్లు) 27.3 ఓవర్లలో 116 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేశారు. ఇక బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (55 పరుగులు*), శ్రేయాస్ అయ్యర్ (52 పరుగులు*) మరో 200 బంతులు మిగిలి ఉండగానే భారత్ కు సునాయాస విజయాన్ని అందించారు. బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

click me!