SA vs IND: అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి: కేఎల్ రాహుల్

By Rajesh Karampoori  |  First Published Dec 18, 2023, 3:46 AM IST

SA vs IND:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. గత మూడేండ్ల కిత్రం ఓటమిని గుర్తు చేసుకున్నారు. 


SA vs IND: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (IND vs SA)మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. భారత బౌలర్ల దాటికి మ్యాచ్‌ వన్‌సైడ్ వార్ గా మారిపోయింది.  భారత ఫాస్ట్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ వరుసగా ఫెవియన్ బాటపట్టారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్ లో ఐడెన్ మార్క్‌రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. తర్వాత దక్షిణాఫ్రికాను 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. స్వంత గడ్డపై దక్షిణాఫ్రికాను అత్యల్ప పరుగులకే అవుట్ చూసి మ్యాచ్ ను వన్ సైడ్ వార్ లాగా మార్చారు. 

2022 జనవరిలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా.. టీమిండియాను 3-0తో ఓడించింది. దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో, మూడో వన్డేలో 4 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల తర్వాత.. అదే జట్టుపై నేడు టీమిండియా విజయం సాధించింది.  

Latest Videos

ఈ గెలుపు అనంతరం టీమిండియా కెప్టెన్  KL రాహుల్  మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ కెప్టెన్‌గా మూడు వన్డేల్లో ఓడిపోయాననీ, నేడు దక్షిణాఫ్రికాలో విజయం సాధించడం బాగుందని రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. గత పర్యటనలో నా కెప్టెన్సీలో మూడు వన్డేలు ఆడితే.. అన్నింటిల్లోనూ ఓడిపోయామని అన్నారు. నేడు పిచ్‌ తాము ఉహించిన దానికి పూర్తి భిన్నంగా స్పందించిందనీ, ఈ పిచ్ పై ఎక్కువగా స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించాలని ప్రణాళికలు వేసుకున్నామనీ, కానీ, వేసుకున్నా ప్రణాళికలు భిన్నంగా పిచ్ ఉందని అన్నారు. గత మ్యాచ్‌లో రిజల్స్ బట్టి.. పిచ్‌ స్పిన్నర్లకు ఎంతగా సహకరిచిందో చూశామనీ, దాంతో ఆరంభంలో అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌తో బౌలింగ్ చేయించాలనుకున్నామని తెలిపారు. కానీ, పిచ్‌ పూర్తిగా పేసర్లకు అనుకూలించిందనీ,  సరైన సమయంలో.. సరైన బౌలింగ్‌ చేశారనీ, యంగ్ బౌలర్లు పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారని కేఎల్ రాహుల్ అన్నాడు. 

విరుచుకపడ్డ పేసర్లు 

దక్షిణాఫ్రికాపై పింక్ వన్డేలో విజయం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేసర్లు అర్ష్‌దీప్‌, అవేశ్‌ఖాన్‌ల ముందు ఆఫ్రికన్‌ బ్యాట్స్‌మెన్‌ లొంగిపోయారు. ఇద్దరు పేసర్లు తమ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీయగా, అవేశ్ 4 వికెట్లు తీశాడు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ వెళ్లిన టిమిండియా అలఓకగా విజయం సాధించింది. భారత్‌ తరఫున శ్రేయాస్‌ అయ్యర్‌, సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల అద్భుత అర్ధశతకాల కారణంగా భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా గెలిస్తే.. కచ్చితంగా కేఎల్ రాహుల్ మూడేళ్ల గాయం పూర్తిగా మాయమవుతుంది.

click me!