స‌చిన్ టెండూల్క‌ర్ కెరీర్ లో ఎదుర్కొన్న అతిపెద్ద స‌వాలు.. చివ‌రకు కెప్టెన్సీ కూడా..

By Mahesh Rajamoni  |  First Published Jul 12, 2024, 1:55 PM IST

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ‌రీ క్రికెట‌ర్. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించి గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు సాధించారు. విజ‌య‌వంత‌మైన త‌న కెరీర్ లో అతిపెద్ద స‌వాలును ఎద‌ర్కోలేక‌పోయాడు.. 


Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ క్రికెట్ రారాజు.. క్రికెట్ దేవుడు.. లెజెండ‌రీ ప్లేయ‌ర్. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు. తన కెరీర్‌లో వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో క‌లిపి 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్. ఎంతో మంది ఆట‌గాళ్ల‌కు రోల్ మోడ‌ల్. సచిన్ టెండూల్కర్ బ్యాట్స్‌మెన్‌గా చాలా విజయవంతమయ్యాడు.. కానీ త‌న కెరీర్ లో అతిపెద్ద స‌వాల‌ను ఎదుర్కొన్నాడు.. నిల‌బ‌డ‌లేక చివ‌ర‌కు వెన‌క్కిత‌గ్గాడు.. అతని జీవితంలో ఇది అతిపెద్ద నిరాశ‌తో కూడిన మ‌చ్చ‌లా మిగిలిపోయింది. అదే కెప్టెన్సీ ! 

సచిన్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు.. !

Latest Videos

సచిన్ టెండూల్కర్ 1996 నుంచి 2000 వరకు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నారు. 1999లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిని చవిచూసింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వన్డే ముక్కోణపు సిరీస్‌లో కూడా భారత్ ప్రదర్శన చాలా పేలవంగా సాగింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, 2000లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. వ‌రుస‌గా జ‌ట్టు నిరాశాజనక ప్రదర్శనతో సచిన్ టీమిండియా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు.

సచిన్ కెరీర్‌లోనే అతి పెద్ద మ‌చ్చ‌.. 

సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న ఆ క్లిష్ట సమయంలో చందూ బోర్డే టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్నారు. తనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సచిన్ టెండూల్కర్ స్వయంగా కోరాడు. త‌న‌కు టీమిండియా కెప్టెన్సీపై ఆసక్తి లేదని, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోరాడు. చందు బోర్డే 1984 నుండి 1986 వరకు, 1999 నుండి 2002 వరకు టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 1996 నుంచి 2000 వరకు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

కొత్త కెప్టెన్‌గా గంగూలీ

చందూ బోర్డే మాట్లాడుతూ.. 'సచిన్ స్వయంగా వచ్చి తనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చెప్పాడు. అతడిని కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు పంపాం. సచిన్ తిరిగి వచ్చాక కెప్టెన్ అవ్వాలని అనుకోలేదు. నేను సచిన్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలనుకున్నాను, మేము భవిష్యత్తు వైపు చూస్తున్నాము, కానీ సచిన్ పదే పదే తిరస్కరించడంతో, సెలక్షన్ కమిటీ గంగూలీని కొత్త కెప్టెన్‌గా నియమించింది' అని చందు బోర్డే తెలిపారు.

2000 సంవత్సరంలో సచిన్ కెప్టెన్సీకి వీడ్కోలు.. 

సచిన్ టెండూల్కర్ మొత్తం 98 అంతర్జాతీయ మ్యాచ్ లకు సారథ్యం వహించగా, అందులో టీం ఇండియా 27 మ్యాచ్ ల్లో మాత్ర‌మే గెలిచింది. 52 మ్యాచ్ ల్లో ఓడింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత్ 73 వన్డేల్లో 23 గెలిచింది. టెస్టుల్లో సచిన్ కెప్టెన్సీలో భార‌త్ 25 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచ్ ల‌ను మాత్రమే గెలుచుకుంది. వ‌రుస ఓట‌ముల మ‌ధ్య టెండూల్క‌ర్ 2000లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.

HARDIK PANDYA: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా..?

click me!