పాకిస్థాన్‌లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ముసాయిదా తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకలో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ అడగబోతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
పాకిస్థాన్‌లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ముసాయిదా తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. అయితే, భారత పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. టోర్నీకి సంబంధించిన మిగతా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లాలా.. లేదా అన్నది భారత్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ఈ నెలలో శ్రీలంకలో జరగనున్న ఐసీసీ సమావేశంలో లేవనెత్తాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తున్నట్లు సమాచారం.
కాగా, 2008 నుంచి టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ కోసం ఒక్కసారి మాత్రమే ఇరు జట్లు కలుసుకున్నాయి. ఆసియా కప్ కోసం భారత జట్టు 2023లో పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్‌లో జరిగింది. ఫైనల్‌తో సహా భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ముసాయి...
15 మ్యాచ్‌ల ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ముసాయిదాను సిద్ధం చేసింది. ఏడు మ్యాచ్‌లు లాహోర్‌లో, ఐదు మ్యాచ్‌లు రావల్పిండిలో, మరో మూడు కరాచీలో నిర్వహించాలని నిర్ణయించింది. ముసాయిదా ప్రకారం.. మార్చి 1న లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. తొలి మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో, ఫైనల్ లాహోర్‌లో జరుగుతుంది. సెమీ ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌లను టీమిండియా లాహోర్‌లో ఆడుతుందని డ్రాఫ్ట్‌లో పీసీబీ పేర్కొంది.