నోరేసుకోవడం కాదు: అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ సంఘటనపై సచిన్

By telugu teamFirst Published Feb 24, 2020, 4:57 PM IST
Highlights

అండర్ 19 ప్రపంచ కప్ పైనల్ మ్యాచు తర్వాత భారత్, బంగ్లాదేశ్ క్రీడాకారులు గొడవ పడిన సంఘటనపై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. దూకుడుగా ఉండడమంటే నోరు పారేసుకుని దుర్భాషలాడుకోవడం కాదని సచిన్ అన్నారు.

న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో ఇటీవల చోటు చేసుకున్న గొడవపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆ గొడవపై మాట్లాడారు. స్వతహాగా ఉండాల్సింది క్రీడాస్ఫూర్తి అని ఆయన అననాడు. జెంటిల్ మెన్ గేమ్ లో స్వతహాగా ఉండాల్సిన లక్షణం అది అని ఆయన అన్నారు. 

క్రమశిక్షణతో మెలగడాన్ని ఎవరైనా ఇతరులకు నేర్పిస్తారని, మిగతా అంతా ఆటగాళ్లకు స్వతహాగా ఉండాలని ఆయన అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రపంచం మొత్తం తమను గమనిస్తుందనే విషయాన్ని ఆటగాళ్లు మరిచిపోకూడదని, ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాలని సచిన్ అన్నారు. 

Also Read: అండర్ 19 ఫైనల్: బంగ్లాదేశ్ క్రికెటర్ల చెత్త ప్రవర్తన, అగ్లీ సీన్స్

ఆటలో మాత్రమే దూకుడు ప్రదర్శించాలని, నోరు పారేసుకుని దుర్భాషలాడడంలో కాదని ఆయన అన్నారు. దూకుడు బౌలింగ్, బ్యాటింగ్ ల్లో ఉండాలని, ఆ దూకుడు ఆటకు పనికి వస్తుందని ఆయన చెప్పారు ఒకరు ఏమీ మాట్లాడనంత మాత్రాన, ఏం చేయనంత మాత్రాన దూకుడుగా లేరనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. 

అందరికీ విజయం సాధించాలనే ఉంటుందని, అందుకు ఒక పద్ధతి ఉంటుందని, పరిమితులు దాటకూడదని, మనలాగే ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలనే తపన ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. 

రోజర్ ఫెదరర్ దూకుడుగా ఉండడని అనుకుంటున్నారా, అతడికి ప్రతి పాయింట్ కూడా గెలువాలనే ఉంటుందని, కానీ అతడి శారీరక భాష, ప్రవర్తించే తీరు మాత్రమే అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు. 

Also Read: అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్: పోరాడి ఓడిన భారత్.. విశ్వవిజేతగా బంగ్లాదేశ్

ఫిట్నెస్ అనేది కేవలం ఆటగాళ్ల నైపుణ్యాన్ని మరింత పొడగిస్తుందని సచిన్ అన్నారు. బ్యాటింగ్ లో మెరుగుపడాలంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని, జిమ్ లో కూర్చుకుంటే అది సాధ్యం కాదని అన్నారు. నెట్ లో సాధన చేస్తే నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. 

click me!