నమస్తే ట్రంప్: మొతేరా క్రికెట్ స్టేడియం లో మన క్రికెటర్ల రికార్డులు తెలుసా...?

By telugu teamFirst Published Feb 24, 2020, 4:25 PM IST
Highlights

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఇప్పుడు ఈ నమస్తే ట్రంప్ ఈవెంట్ జరిగిన సందర్భంగా అసలు ఈ మొతేరా స్టేడియం గురించి అందరూ గూగుల్ లో వెదకటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్టేడియం విశేషాలు, ఇక్కడి క్రికెటింగ్ రికార్డులు మీకోసం.... 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో భారత్ లో దిగారు. ఆయన నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 

ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా మొతేరా క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ హోమ్ మంత్రి అమిత్ షాని ట్రంప్ దంపతులకు మోడీ పరిచయం చేసారు. 

Also read; అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఇప్పుడు ఈ నమస్తే ట్రంప్ ఈవెంట్ జరిగిన సందర్భంగా అసలు ఈ మొతేరా స్టేడియం గురించి అందరూ గూగుల్ లో వెదకటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్టేడియం విశేషాలు, ఇక్కడి క్రికెటింగ్ రికార్డులు మీకోసం.... 

గతంలో కూడా ఇక్కడ స్టేడియం ఉండేది. దాని బాధ్యతలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించేది. అప్పట్లో దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం గా వ్యవహరించేవారు. 

ప్రస్తుతం ఇప్పుడు ఈ క్రికెట్ స్టేడియాన్ని పునర్నిర్మించాలని అప్పట్లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుకున్నారు. అప్పట్లో దీని సామర్థ్యం 49 వేలుగా ఉండేది. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని లక్షా పదివేల మంది కూర్చునేందుకు వీలుగా పెంచారు. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం. 

Also read: గాంధీ గారి మూడు కోతుల బొమ్మ... ట్రంప్ ఫిదా

ఈ స్టేడియంలో అనేక క్రికెట్ రికార్డులు ఉన్నాయి. ఇదే వేదికపై కపిల్ దేవ్ 1983లో ఒకే ఇన్నింగ్స్ లో 9 వికెట్లను పడగొట్టాడు. కపిల్ దేవ్ పేరిట ఇక్కడ మరో రికార్డు కూడా ఉంది. ఇదే స్టేడియంలో అత్యధిక వికెట్లు సాధించిన వీరుడిగా రికార్డు సృష్టించాడు. 

1994లో కపిల్ దేవ్ 432వ టెస్టు వికెట్ తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అప్పటివరకు సర్ రిచర్డ్ హ్యడ్లి పేరుమీదున్న రికార్డును కపిల్ తుడిచిపెట్టేసాడు. 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే 10 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా సునీల్ గవాస్కర్ రికార్డు సృష్టించాడు. ఇదే వేదికపై సునీల్ గవాస్కర్ ఆ ఫీటును సాధించాడు. ఇక టెండూల్కర్ రికార్డు సృష్టించని మైధాలను ఏవి ఉండవు. 

సచిన్ టెండూల్కర్ ఇదే వేదికపై వన్డే క్రికెట్ చరిత్రలో 18వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 2011లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచులో లిటిల్ మాస్టర్ ఈ ఫీట్ ను సాధించాడు. 

click me!