గోల్ఫ్ అదరగొట్టిన సచిన్.. ఈ వీడియో చూడండి..!

Published : Aug 14, 2021, 10:23 AM IST
గోల్ఫ్ అదరగొట్టిన సచిన్.. ఈ వీడియో చూడండి..!

సారాంశం

. ఈ రోజు మాత్రం ఎడమ చేతితో ఆడినట్లు చెప్పాడు. అందుకు.. తనకు యువరాజ్ సింగ్ సహాయం చేశాడని.. ఎడమ చేతితో ఎలా ఆడాలో యువరాజ్ నేర్పించాడని  సచిన్ పేర్కొన్నాడు.

ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. కి ప్రపంచ దేశాల్లోనూ విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఆయన ఆటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే.. ఆయనను క్రికెట్ గాడ్ అని కూడా పిలుస్తారు. అయితే.. సచిన్.. కేవలం క్రికెట్ మాత్రమే  కాదు.. గోల్ఫ్ కూడా అదరగొట్టగలనని తాజాగా నిరూపించాడు. అది కూడా ఎడమ చేతితో ఆడటం విశేషం.

ఆయనకు అలా ఎడమ చేతితో ఆడేలా కోచింగ్ ఇచ్చింది.. యువరాజ్ సింగ్ కావడం విశేషం. తాను గోల్ఫ్ ఆడుతున్న వీడియోని సచిన్ షేర్ చేశారు. తాను రెగ్యులర్ గా కుడి చేతితోనే ఆడతానని.. అయితే.. ఈ రోజు మాత్రం ఎడమ చేతితో ఆడినట్లు చెప్పాడు. అందుకు.. తనకు యువరాజ్ సింగ్ సహాయం చేశాడని.. ఎడమ చేతితో ఎలా ఆడాలో యువరాజ్ నేర్పించాడని  సచిన్ పేర్కొన్నాడు.

కాగా.. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా మంది హార్ట్ ఎమోజీలు కామెంట్ రూపంలో పోస్టు చేయడం విశేషం.

 

కాగా.. దేశంలో కరోనా విజృంభించడం మొదలుపెట్టినప్పటి నుంచి సచిన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక వీడియోని షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా.. షేర్ చేసిన ఈ వీడియో కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం.

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?