IPL2021: దుబాయి చేరుకున్న ధోనీ అండ్ టీమ్..!

Published : Aug 14, 2021, 09:43 AM ISTUpdated : Aug 14, 2021, 09:49 AM IST
IPL2021: దుబాయి చేరుకున్న ధోనీ అండ్ టీమ్..!

సారాంశం

ధోనీతో సహా.. ఇతర టీమ్  శుక్రవారమే.. దుబాయి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. వారంతా ఎయిర్ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు అవి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్.. దుబాయి చేరుకుంది. ఐపీఎల్ లోని అన్ని జట్ల కన్నా ముందే.. సీఎస్కే అక్కడకు వెళ్లడం గమనార్హం. కెప్టెన్ మమేంద్ర సింగ్ ధోనీ అతనితోపాటు.. భార్య సాక్షి, కుమార్తె జీవా కూడా వెంట వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టంట వైరల్ గా కూడా మారాయి.

ధోనీతో సహా.. ఇతర టీమ్  శుక్రవారమే.. దుబాయి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. వారంతా ఎయిర్ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు అవి.

కాగా. ఐపీఎల్ కోసం చెన్నై జట్టు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే చెన్నైలో కొద్దిరోజులు ప్రాక్టీస్ కూడా చేశారు. తాజాగా యూఏఈ చేరుకున్నారు. అక్కడ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ సీజన్ లో మిగిలిన 31 మ్యాచుల్లో ధోనీ పాల్గొంటాడు.  మరోవైపు భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ లో బయో బబుల్ లోని పలువురు ఆటగాళ్లు.. కరోనా బారిన పడటంతో.. మే 4న  టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు.

ఈ క్రమంలో సీఎస్కే అప్పుడు ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో.. సెప్టెంబర్ లో తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శన చేసి విజేతగా నిలవాలని ధోనీ సహా.. అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..