ENG vs IND:డీఆర్ఎస్ కి కొత్త అర్థం.. సిరాజ్ ని టీజ్ చేసిన జాఫర్

By telugu news teamFirst Published Aug 14, 2021, 8:46 AM IST
Highlights

సిరాజ్ ని నమ్మి.. అతని కోరిక మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సార్లు డీఆర్ఎస్( డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరాడు. అయితే.. రెండు సార్లు అది ఫెయిల్ అయ్యింది.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో టీమిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా  పేసర్ మహ్మద్ సిరాజ్ మరీ అద్భుతంగా అదరగొడుతున్నాడు. తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లాండ్ వరస వికెట్లు పడగొట్టాడు. కాగా.. నిన్నటి మ్యాచ్ లో మాత్రం డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు. సిరాజ్ ని నమ్మి.. అతని కోరిక మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సార్లు డీఆర్ఎస్( డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరాడు. అయితే.. రెండు సార్లు అది ఫెయిల్ అయ్యింది.

రెండు సార్లు సిరాజ్ కారణంగా డీఆర్ఎస్ కోల్పోవడంతో.. మరో ఇండియన్ క్రికెటర్ వసీమ్ జాఫర్.. సిరాజ్ ని టీజ్ చేశాడు. సిరాజ్ ని ఆటపట్టిస్తూ.. డీఆర్ఎస్ కి కొత్త అర్థం చెప్పాడు. డీఆర్ఎస్ అంటే.. డోంట్ రివ్యూ సిరాజ్ అంటూ ట్వీట్ చేశాడు. దాని పక్కన ఓ ఎమోజీని కూడా పెట్టాడు. కాగా.. వసీం జాఫర్ చేసిన ట్వీట్.. ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

DRS: Don't Review Siraj 😛

— Wasim Jaffer (@WasimJaffer14)

ఇదిలా ఉండగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ లో మొదటి రోజు కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.  రెండోరోజు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.  మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 
 

click me!