RR vs LSG : రహానె, బట్లర్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్..

By Mahesh Rajamoni  |  First Published Mar 24, 2024, 8:34 PM IST

RR vs LSG: అజింక్య రహానె, జోస్ బట్లర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేయడం ద్వారా సంజూ శాంసన్ సర్టిఫైడ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్) లెజెండ్ గా చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భారీ ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ రాయల్స్ కు తొలి మ్యాచ్ లోనే విజయం అందించాడు.  
 


Sanju Samson : ఐపీఎల్ 2024 4వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కెప్టెన్ సంజూ శాంసన్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆర్ఆర్ కు విజ‌యం అందించాడు. అజేయంగా 82 పరుగులు చేయడంతో రాజ‌స్థాన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో 20 ఓవ‌ర్ల‌లో ల‌క్నో జ‌ట్టు  173/6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది.

సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టుకు భారీ స్కోర్ చేసింది. శాంసన్ 52 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసిన రియాన్ పరాగ్ తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధృవ్ జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేయ‌డంతో రాజ‌స్థాన్ 193 ప‌రుగులు చేయ‌డంతో ఐపీఎల్ 2024లో విజ‌యంతో ప్ర‌యాణం ప్రారంభించింది.

Latest Videos

PBKS vs DC : పృథ్వీ షాకు షాకిచ్చిన ఢిల్లీ.. షాయ్ హోప్ అరంగేట్రం.. నెటిజ‌న్లు షాక్.. !

ఈ మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ సంజూ శాంస‌న్ మ‌రో  రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరుపున 23వ అర్ధశతకం సాధించిన శాంసన్.. జోస్ బట్లర్, అజింక్య రహానె వంటి ఆటగాళ్లను సమం చేశాడు. బట్లర్, రహానే ఇద్దరూ 23 హాఫ్ సెంచ‌రీలు కొట్టారు.

అన్ని టీ20ల్లో రాయల్స్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు:

23 - జోస్ బట్లర్ (71 ఇన్నింగ్స్ లు)

23 - అజింక్యా రహానే (99 ఇన్నింగ్స్ లు)

23 - సంజూ శాంసన్ (127 ఇన్నింగ్స్ లు)

23 - వాట్సన్ (81 ఇన్నింగ్స్ లు)
ధోనిని టీమిండియా కెప్టెన్ చేసింది అందుకే.. స‌చిన్ టెండూల్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

click me!