RR vs LSG Highlights: నికోల‌స్ పూరాన్ పోరాటం ఫలించలేదు.. సంజూ అద‌ర‌గొట్టాడు

Published : Mar 24, 2024, 10:15 PM IST
RR vs LSG Highlights: నికోల‌స్ పూరాన్ పోరాటం ఫలించలేదు.. సంజూ అద‌ర‌గొట్టాడు

సారాంశం

RR vs LSG Highlights: ఐపీఎల్ 2024 4వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కెప్టెన్ సంజూ శాంసన్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ల‌క్నో ప్లేయ‌ర్ నికోల‌స్ పూరాన్ చివ‌రివ‌ర‌కు త‌న పోరాటం కొన‌సాగించాడు.   

RR vs LSG Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ లో భాగంగా ఆదివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మధ్య 4వ మ్యాచ్ జ‌రిగింది. బాల్, బ్యాట్ తో రాణించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 20 ప‌రుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ (82 పరుగులు) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ప‌రుగుల దూరంలో ఆగిపోయింది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇన్నింగ్స్ లో సంజూ శాంస‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 82 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు. అలాగే, రియాన్ ప‌రాగ్ 43 ప‌రుగులు, ధృవ్ జురెల్ 20 ప‌రుగుల‌తో రాణించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో నవీన్-ఉల్-హక్ 2 వికెట్లు తీసుకున్నాడు.

ధోనిని టీమిండియా కెప్టెన్ చేసింది అందుకే.. స‌చిన్ టెండూల్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

 

భారీ టార్గెట్ తో ల‌క్నో ఇన్నింగ్స్ ను డికాక్, కేఎల్ రాహుల్ లు ప్రారంభించారు. 4 పరుగుల వద్ద డికాక్ ఔటయ్యాడు. వెంట‌నే 10 ప‌రుగుల వ‌ద్ద పడిక్కల్ రెండో వికెట్ గా పెవిలియ‌న్ కు చేరాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఆయుష్ బ‌దోని కూడా 1 ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. దీంతో ల‌క్నో 11 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 58 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు.

 

ల‌క్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్ర‌మే చేసి 20 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. నికోల‌స్ పూరన్ చివ‌రివ‌ర‌కు పోరాడిన జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. పురాన్ త‌న  64 పరుగులు ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీశాడు.
 

RR VS LSG : రహానె, బట్లర్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !