RRvsDC: ‘టాప్’ లేపిన ఢిల్లీ... రాజస్థాన్ వరుసగా నాలుగో ఓటమి...

Published : Oct 09, 2020, 11:22 PM IST
RRvsDC: ‘టాప్’ లేపిన ఢిల్లీ... రాజస్థాన్ వరుసగా నాలుగో ఓటమి...

సారాంశం

34 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్... రాహుల్ తెవాటియా మెరుపులు వృథా...  

IPL 2020 సీజన్‌లో యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ ఆటతో మరో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. తమకు కలిసొచ్చిన షార్జా స్టేడియంలో కూడా విక్టరీ కొట్టలేక, సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని మూటకట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్... 138 పరుగులకే పరిమితమైంది.

జోస్ బట్లర్ 13, స్టీవ్ స్మిత్ 24, సంజూ శాంసన్ 5, మహిపాల్ లోమ్రోర్ 1 పరుగుకే పెవిలియన్ చేరగా 36 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్  టాపార్డర్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రూ టై 6, ఆర్చర్ 2, శ్రేయాస్ గోపాల్ 2 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా మరోసారి మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కగా, రబడా మూడు వికెట్లు తీశాడు. హర్దల్ పటేల్, నోకియా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !