RR vs DC: ఢిల్లీ భారీ స్కోరు... రాజస్థాన్‌కి ‘షార్జా లక్’ కలిసొస్తుందా...

Published : Oct 09, 2020, 09:16 PM ISTUpdated : Oct 09, 2020, 10:38 PM IST
RR vs DC: ఢిల్లీ భారీ స్కోరు... రాజస్థాన్‌కి ‘షార్జా లక్’ కలిసొస్తుందా...

సారాంశం

స్టోయినిస్, అక్షర్ పటేల్ మెరుపులు... 45 పరుగులు చేసిన హెట్మయర్...  

IPL 2020 సీజన్ 13లో సిక్సర్ల వర్షం కురిసిన షార్జాలో తొలిసారిగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగుల లోపు స్కోరు నమోదు చేసింది. పృథ్వీషా, ధావన్, రిషబ్ పంత్, అయ్యర్ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోర్లకే పరిమితం చేసిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు... ఢిల్లీ భారీ స్కోరు చేయకుండా మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. స్టోయినిస్, హెట్మయర్, అక్షర్ పటేల్ మెరుపులతో మంచి స్కోరు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది ఢిల్లీ.

పృథ్వీషా 19, శిఖర్ ధావన్ 5, శ్రేయాస్ అయ్యర్ 22, రిషబ్ పంత్ 5 పరుగులు చేసి అవుట్ కాగా స్టోయినిస్ 30 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. 24 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో చేసిన హెట్మయర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ రనౌట్ కాగా అక్షర్ పటేల్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, రాహుల్ తెవాటియాలకు తలా ఓ వికెట్ దక్కింది. 

 

PREV
click me!

Recommended Stories

Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా