చెన్నై ఓటమి: ధోనీ నువ్వు సరిగ్గా ఆడకపోతే.. నీ కూతురిని....

Siva Kodati |  
Published : Oct 09, 2020, 04:53 PM IST
చెన్నై ఓటమి: ధోనీ నువ్వు సరిగ్గా ఆడకపోతే.. నీ కూతురిని....

సారాంశం

భారతదేశంలో క్రికెట్ ఒక మతమైతే, క్రికెటర్లు దేవుళ్లు. అభిమానులు క్రికెటర్లపై ప్రేమను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వుంటారు. తమ ఆరాధ్య ఆటగాడిని ఎవరైనా ఏమైనా అంటే విశ్వరూపం చూపిస్తారు.

భారతదేశంలో క్రికెట్ ఒక మతమైతే, క్రికెటర్లు దేవుళ్లు. అభిమానులు క్రికెటర్లపై ప్రేమను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వుంటారు. తమ ఆరాధ్య ఆటగాడిని ఎవరైనా ఏమైనా అంటే విశ్వరూపం చూపిస్తారు.

అయితే కొందరు అభిమానం పేరిట పిచ్చి వేషాలు వేయడమే కాకుండా హద్దులు దాటి కామెంట్లు చేస్తూ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ఆ జట్టు కెప్టెన్ ధోనీని టార్గెట్ చేస్తూ సోషల్  మీడియాలో విరుచుకుపడ్డారు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు.

దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్‌ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు.

ఆటతో ఏమాత్రం సంబంధం లేని ధోనీ కుమార్తె, చిన్నారి జీవాపైనా విషం చిమ్మారు. ఇక ముందు సరిగ్గా ఆడకపోతే ఆమెపై అత్యాచారం చేస్తామంటూ ధోనీకి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహీ ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నిచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?