రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఆర్సీబీకి రూ.30 లక్షల నష్టం

By Mahesh Rajamoni  |  First Published Dec 25, 2023, 1:53 PM IST

Ruturaj Gaikwad injury: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే, అత‌ని గాయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కి రూ.30 ల‌క్ష‌ల న‌ష్టం క‌లిగించింది. అస‌లు ఏమైంది ఈ మహారాష్ట్ర బ్యాట్స్ మన్ కు..? ఆర్సీబీకి ఎందుకు లాస్..? 


IPL 2024-Royal Challengers Bangalore: రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు.  గాయం రజత్ పాటిదార్ డబుల్ ధమాకాగా మారింది. అత‌ని గాయంతో ర‌జ‌త్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇదే స‌మ‌యంలో 30 లక్షల బంపర్ ప్రైజ్ కూడా అందుకున్నాడు. ఆర్సీబీకి రూ. 30 ల‌క్ష‌ల నష్టం క‌లిగించింది. ఇది మీకు కాస్త ఆయోమ‌యం క‌లిగించ‌వ్చు.. దీనికి వెనుక ఉన్న అస‌లు క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.. ! 

రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఆర్సీబీకి రూ.30 లక్షలు నష్టం

Latest Videos

ఒక‌రి గాయం ఇంకోక‌రికి న‌ష్టం క‌లిగించింది. టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ గాయం ఆర్సీబీకి పెద్ద న‌ష్టం క‌లిగించింది.  అదెలాగో తెలుసుకునే ముందు ఈ మహారాష్ట్ర బ్యాట్స్ మన్ కు ఏమైందో తెలుసుకుందాం.. ! దక్షిణాఫ్రికా సిరీస్ కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ టీ20 సిరీస్ అంతటా ఆడి తొలి రెండు వన్డే మ్యాచ్  లో కూడా క‌నిపించాడు. అయితే వేలి గాయం కారణంగా మూడో, చివరి మ్యాచ్ కు దూరమయ్యాడు. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కూడా దూరమయ్యాడు. ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లో భారత జ‌ట్టులో స్థానంలో కోల్పోయాడు. రుతురాజ్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి తీసుకున్నాడు.

టెస్టు జట్టులో రుతురాజ్ రిజర్వ్ ఓపెనర్ గా ఉన్నాడు. ఈ టెస్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఒకవేళ ఈశ్వరన్ ను ఎంపిక చేసినా రిజర్వ్ ఓపెనర్ గా జట్టులో ఉండాల్సి ఉంటుంది. రుతురాజ్ దక్షిణాఫ్రికా నుంచి నేరుగా బెంగళూరు వచ్చాడు. ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకుని త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

రుతురాజ్ గాయంతో వన్డేల్లో అరంగేట్రం చేసిన రజత్ పటిదార్

రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా రజత్ పాటిదార్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రజత్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లో పెరిగిన రెమ్యునరేషన్..

ఐపీఎల్ లో మధ్యప్రదేశ్ ఓపెనర్ రజత్ పాటిదార్ ను ఆర్సీబీ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కు కొనుగోలు చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటంతో అతడి బేస్ ప్రైస్ రూ.50 లక్షలకు చేరింది. అవును, ఐపీఎల్ లో అంతర్జాతీయ క్రికెటర్ల బేస్ ప్రైస్ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఐపీఎల్ 2024 సీజన్ తో పాటిదార్ రూ.20 లక్షలకు బదులు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రుతురాజ్ గాయం కారణంగా ఆర్సీబీకి రూ.30 లక్షల నష్టం వాటిల్లింది. ఇదే స‌మ‌యంలో రజత్ అంత‌ర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.  మొత్తంగా ఒక ప్లేయ‌ర్ గాయం మ‌రో ప్లేయ‌ర్ కు డ‌బుల్ ధ‌మాకా గా మారింది.. !

ICC T20 WORLD CUP 2024: ఇంగ్లాండ్ లో కొత్త ప్ర‌యాణం షురూ చేసిన కీరన్ పొలార్డ్..

click me!