IND VS SA: అశ్విన్ ముందు అరుదైన రికార్డు..

By Mahesh Rajamoni  |  First Published Dec 25, 2023, 12:05 PM IST

Ravichandran Ashwin: సౌతాఫ్రికాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టెస్టు సిరీస్ గెల‌వ‌ని భార‌త్ ఈ ప‌ర్య‌ట‌న‌లో చ‌రిత్ర‌ను సృష్టించాల‌నుకుంటోంది. అయితే, ఈ టెస్టు సిరీస్ లో అడుతున్న భార‌త్ బౌల‌ర్ అశ్విన్ అరుదైన రికార్డులు న‌మోదుచేయ‌నున్నాడు. 
 


India Vs South Africa 1st Test: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్ బాక్సింగ్ డే (డిసెంబర్ 26)న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ను గెలిచి భార‌త్ చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై భార‌త్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెల‌వ‌లేదు. 

భారత్-దక్షిణాఫ్రికాల హెడ్ టూ హెడ్ టెస్టు రికార్డులు గ‌మ‌నిస్తే..  రెండు దేశాలు మొత్తం 42 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత్ 15 మ్యాచ్ ల‌ను గెలుచుకోగా, దక్షిణాఫ్రికా గెలిచింది 17 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఇక 10 టెస్టు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఇక ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఇరు దేశాల రికార్డులు గ‌మ‌నిస్తే..మొత్తం 23 టెస్టులు ఆడగా, దక్షిణాఫ్రికా 12 మ్యాచ్ ల‌లో గెలిచింది. భార‌త్ కేవలం 4 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలిచి, మ‌రో 7 మ్యాచ్ ల‌ను డ్రా చేసుకుంది. 

Latest Videos

undefined

బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వ‌చ్చింది?

అయితే, ఈ టెస్టు సిరీస్ లో మ‌రిన్ని స‌రికొత్త రికార్డులు న‌మోదుకానున్నాయి. ముఖ్య‌మంగా భార‌త్ బౌల‌ర్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించే అవ‌కాశముంది. నంబర్ 1 టెస్ట్ బౌలర్ ఆర్ అశ్విన్ ఆఫ్రికన్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో ప్రత్యేకమైన ఫీట్ 500 వికెట్ల క్ల‌బ్ లో చేర‌నున్నాడు. అశ్విన్ ఇప్పటి వరకు 94 టెస్టులాడిన  489 వికెట్లు తీశాడు. వీటిలో 34 సార్లు 5 వికెట్లు తీయ‌డం విశేషం. అటువంటి పరిస్థితిలో, ఆర్ అశ్విన్ 500 వికెట్లు తీసిన ఫీట్‌కు కేవలం 11 వికెట్ల దూరంలో ఉన్నాడు. అశ్విన్ దీన్ని 2 టెస్టు మ్యాచ్‌ల్లో సులభంగా సాధించగలడు. 

అంటే అశ్విన్ మ‌రో 11 వికెట్లు తీస్తే 500 వికెట్లు తీసిన బౌల‌ర్ల లిస్టులో చేరుతాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 10/74. భార‌త వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా కుంబ్లే నిలిచాడు. కుంబ్లే 269 వన్డేల్లో 335 వికెట్లు తీశాడు.

హార్దిక్ పాండ్యా డీల్ లో ముంబై ఇండియ‌న్స్ రూ.100 కోట్లు గుజ‌రాత్ కు చెల్లించిందా..?

click me!