రోహిత్ శ‌ర్మ‌ది 'గోల్డెన్ హార్ట్'.. అలాంటి వారిని ఎప్పుడూ చూడ‌లేదు.. హిట్​మ్యాన్ పై అశ్విన్ ప్ర‌శంస‌లు !

By Mahesh Rajamoni  |  First Published Mar 13, 2024, 11:59 AM IST

Team India: ఇటీవ‌ల ముగిసిన భార‌త్-ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను టీమిండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో 4-1 అధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీని గుర్తుచేసుకున్న స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ది 'గోల్డెన్ హార్ట్' అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. 
 


Rohit Sharma-Ravichandran Ashwin: హిట్​మ్యాన్ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో ఇంగ్లాండ్ తో జ‌రిగిన 5 మ్యాచ్ ల టుస్టు సిరీస్ ను భార‌త్ 4-1 ఆధిక్యంతో కైవ‌సం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ లో అద్బుత‌మైన ఆట‌తో రాణించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రాజ్‌కోట్‌లో జ‌రిగిన 3వ టెస్టు రెండో రోజు మధ్యలోనే నిష్క్రమించాడు. ప్రైవేట్ విమానంలో చెన్నై బయలుదేరాడు. ఆ మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లో 500వ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా మధ్యలోనే రావాల్సి వ‌చ్చింది.

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ మ్యాచ్‌లో ఆడడని అంతా భావించారు. కానీ అశ్విన్ మ్యాచ్ 4వ రోజు ఆడి భారత జట్టు విజయంలో త‌న‌దైన పాత్ర పోషించాడు. ఆ క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్న అశ్విన్.. మ్యాచ్ జరుగుతుండగా తన తల్లి ఆరోగ్యం బాగోలేదని భార్య చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్నారనీ, వెంటనే రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ఇంటికి వెళ్లి తన తల్లిని చూసేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని ఈ స్టార్ స్పిన్న‌ర్ చెప్పాడు. దీని గురించి అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘‘అమ్మ స్పృహలో ఉందా అని అడిగాను. చూసే స్థితిలో లేద‌ని డాక్టర్ చెప్పారు. దాంతో నేను ఏడవడం మొదలుపెట్టాను. వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డ‌కు వెళ్ల‌డానికి విమానం కోసం చూశాను. కానీ రాజ్‌కోట్ విమానాశ్రయంలో 6 గంటల తర్వాత విమానం అందుబాటులో ఉంటుంద‌ని చెప్పార‌ని అశ్విన్ పేర్కొన్నాడు.

Latest Videos

RANJI TROPHY 2024: సచిన్ టెండూల్కర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన సర్బరాజ్ ఖాన్ సోదరుడు

''అందుకే ఏం చేయాలో తోచలేదు. తర్వాత రోహిత్, రాహుల్ నా రూమ్‌కి వచ్చి ఏం కంగారు పడకుండా వెంటనే వెళ్లి కుటుంబాన్ని చూడమని చెప్పారు. టీమ్ ట్రైనర్ కమలేష్ నాకు చాలా మంచి స్నేహితుడు. రోహిత్ నాతో పాటు చెన్నైకి రమ్మని అడిగాడు. అయితే నేను అతనిని వెనక్కి ఉండమని అడిగాను. కానీ కమలేష్, సెక్యూరిటీ కింద నా కోసం వేచి ఉన్నారు. రోహిత్ శర్మ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కమలేష్‌కు ఫోన్ చేసి ఈ కష్ట సమయంలో నాతో ఉండమని అడిగాడు. రాత్రి 9.30 అయింది. నేను ఆశ్చర్యపోయాను. ఊహించలేము కూడా. ఆ ఇద్దరు మాత్రమే నేను విమానంలో మాట్లాడాను. రోహిత్ కమలేష్‌కి ఫోన్ చేసి ఇంటికి తిరిగొచ్చేంత వరకు నన్ను చూసుకున్నాడు'' అని పేర్కొన్నాడు.

''రోజు రోహిత్ శర్మలో ఒక గొప్ప నాయకుడిని చూశాను. చాలా మంది కెప్టెన్ల కింద ఆడాను. కానీ రోహిత్ శర్మ మంచి మనసుతో ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. రోహిత్ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు.. అత‌నిది గోల్డెన్ హార్ట్. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. దేవుడు సులభంగా ఇవ్వడు. దేవుడు అతనికి అన్నింటికంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఈ స్వార్థపూరిత సమాజంలో ఆయనలాగా ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించే వారు అరుదు. ఆటగాడిని ప్రశ్నించకుండా సపోర్ట్ చేసే కెప్టెన్‌గా అతని పట్ల నాకు ఇప్పటికే గౌరవం ఉందని'' అశ్విన్ పేర్కొన్నాడు. 

WPL 2024: ఎల్లిస్ పెర్రీ అద్భుత బౌలింగ్.. ముంబైని చిత్తుచేసిన బెంగ‌ళూరు !

click me!