India vs Afghanistan: 4 ఓవర్లలకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ లో బ్యాట్ తో అదరగొట్టారు. సూపర్ షాట్స్ ఆడుతూ టీ20 క్రికెట్ లో మరో సెంచరీ సాధించాడు. దీంతో టీ20 క్రికెట్ లో ఐదు సెంచరీలు చేసిన ఒకేఒక్కడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
India vs Afghanistan T20 Match:టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కడు. టీ20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల మోత మోగించాడు. 64 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఐదు సెంచరీలు బాదిన ప్లేయర్ గా రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 2024లో తొలి సెంచరీ కొట్టాడు. అలాగే, మరో ఎండ్ లో రింకూ సింగ్ బౌండరీలతో విరుచుకుపడటంతో భారత్ 20 ఓవర్లలో 212/4 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ ముందు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచుంది.
🎥 That Record-Breaking Moment! 🙌 🙌 notches up his 5⃣th T20I hundred 👏 👏
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL | | pic.twitter.com/ITnWyHisYD
టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ వీళ్లే..
రోహిత్ శర్మ-5
సూర్యకుమార్ యాదవ్-4
గ్లెన్ మాక్స్‌వెల్-4
IND VS AFG: వాట్ ఏ షాట్.. ! అద్భుతమై రివర్స్ స్విప్ షాట్ తో అదరగొట్టిన రోహిత్ శర్మ
ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ తన బ్యాట్ తో అదరగొట్టాడు. రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు.
FIFTY for - his 2⃣nd T20I half-century! 👌 👌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL | | pic.twitter.com/igug05vWXn
భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ 121*, రింకూ సింగ్ 69*, యశస్వి జైస్వాల్ 4, విరాట్ కోహ్లీ 0, శివమ్ దుబే 1, సంజూ శాంసన్ 0 పరుగులు చేశారు. 20 ఓవర్లలో భారత్ 212/4 పరుగులు చేసింది.
భారత్ వికెట్ల పతనం : 18-1 ( యశస్వి జైస్వాల్ , 2.3), 18-2 ( విరాట్ కోహ్లీ , 2.4), 21-3 ( శివమ్ దూబే , 3.6), 22-4 ( సంజు శాంసన్ , 4.3)
మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ కు మూడినట్టేనా.. భారత్ చేతిలో వైట్ వాష్ తప్పదా.. !
భారత్-అఫ్గానిస్థాన్ 3వ టీ20 కోసం జట్లు:
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ ఎ సఫీ, మలీద్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజు శాంసన్(w), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..