రోహిత్ శర్మకు షాక్ ఇచ్చిన బెన్ స్టోక్స్... 49 పరుగుల వద్ద అవుటైన హిట్ మ్యాన్...

Published : Mar 05, 2021, 01:17 PM IST
రోహిత్ శర్మకు షాక్ ఇచ్చిన బెన్ స్టోక్స్... 49 పరుగుల వద్ద అవుటైన హిట్ మ్యాన్...

సారాంశం

49 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీసిన బెన్ స్టోక్స్...

విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన బెన్ స్టోక్స్, హాఫ్ సెంచరీ చేరువైన రోహిత్ శర్మను కూడా పెవిలియన్ చేర్చాడు. 144 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ.

121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా. అజింకా రహానే 45 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 84 పరుగులు వెనకబడి ఉన్న టీమిండియా, మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కించుకోవాలంటే పంత్, అశ్విన్ మధ్య ఓ భారీ భాగస్వామ్యం రావాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

IPL 2027 Trades: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ధమాకా.. టీమ్స్ మారిన రిషభ్ పంత్, కుల్దీప్, లివింగ్‌స్టన్
Highest Score in ODIs: సెహ్వాగ్ నుంచి గిల్ వరకు.. కెప్టెన్లుగా అత్యధిక స్కోర్లు కొట్టిన టాప్ 5 టీమిండియా స్టార్స్ వీరే