ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు... సున్నాకే తొలి వికెట్... మొదటి రోజు ఆట ముగిసే సమయానికి...

By team teluguFirst Published Mar 4, 2021, 5:08 PM IST
Highlights

తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 24/1...

డకౌట్ అయిన శుబ్‌మన్ గిల్...

అత్యధిక డకౌట్లు చేసిన బౌలర్‌గా అండర్సన్ అరుదైన రికార్డు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ముగిసే సమయానికి 12 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. మూడోఇన్నింగ్స్ ఆరంభించిన మూడో బంతికే శుబ్‌మన్‌ గిల్‌ను డకౌట్ చేశాడు జేమ్స్ అండర్సన్.

సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టుకి రోహిత్ శర్మ 8, పూజారా 15 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా కాపాడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 75.5 ఓవర్లలో 205 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్ 55 పరుగులు చేయగా డానియల్ లారెన్స్ 46 పరుగులు చేశాడు. 

మొదటి రోజు మొదటి సెషన్‌లో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడ్డాయి. మూడో సెషన్‌లో ఏకంగా ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోగా, భారత జట్టు ఓ వికెట్ కోల్పోయింది.

అండర్సన్ ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఐదు మెయిడిన్లుగా ముగించడం విశేషం. గిల్‌ను డకౌట్ చేసిన అండర్సన్, 104 మంది బ్యాట్స్‌మెన్లను డకౌట్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అండర్సన్ బౌలింగ్‌లో 30 మంది భారత బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం. 

click me!