విరాట్ కోహ్లీ డకౌట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా... వెంటవెంటనే...

By team teluguFirst Published Mar 5, 2021, 10:47 AM IST
Highlights

బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ...

41 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా...

2014 ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఒకే సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయిన విరాట్ కోహ్లీ...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా 41 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌గా 60వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 8 బంతులు ఎదుర్కొని, పరుగులేమీ చేయకుండానే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఓవర్‌నైట్ స్కోరు 24/1 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా, మరో 16 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది. 66 బంతుల్లో ఒక ఫోర్‌తో 17 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ మూడో బంతికే డకౌట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం తన స్టైల్‌కి విరుద్దంగా డిఫెన్స్ ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. 84 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు రోహిత్ శర్మ...

Last Updated Mar 5, 2021, 10:48 AM IST