సూపర్ ఓవరు వేసిన బుమ్రా, ఎందుకంటే: రోహిత్ శర్మ జవాబు

By telugu teamFirst Published Jan 31, 2020, 8:17 AM IST
Highlights

న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచులో సూపర్ ఓవర్ వేయడానికి బుమ్రానే ఎందుకు పంపించారనే విషయంపై రోహిత్ శర్మ వివరణ ఇచ్చారు. బుమ్రాను పంపించడానికి యార్కర్లు సంధించడం కారణమని రోహిత్ శర్మ చెప్పాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవరు వేయడానికి జస్ ప్రీత్ బుమ్రానే ఎందుకు పంపినట్లు అనే విషయంపై టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చారు. న్యూజిలాండ్ మీద మూడో టీ20 టై కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవరు నిర్వహించిన విషయం తెలిసిందే. సూపర్ ఓవరు ద్వారా ఇండియా న్యూజిలాండ్ పై విజయం సాధించింది. 

నిజానికి, మ్యాచులో బుమ్రా అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ అతని ఓవర్లలో మొత్తం 45 పరుగులను రాబట్టుకుంది. ఆ స్థితిలో బుమ్రాపై ఇండియా సూపర్ ఓవరు వేయించడం విచిత్రమే. సూపర్ ఓవరులోనూ బుమ్రా 17 పరుగులు సమర్పించుకున్నాడు. 

Also Read: సూపర్ ఓవర్ విజయంపై కోహ్లీ, రోహిత్ శర్మ స్పందన ఇదే.

ఆ విషయంపై రోహిత్ శర్మ మాట్లాడాడు. మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్ కు దారి తీస్తే ఆ సమయంలో ఏ విధమైన ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉండనది, ఆ రోజు ఆటలో ఏం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, ఆ రోజు బాగా ఆడినవారిని పంపిస్తారని చెప్పారు. 

బుమ్రా టీమిండియాలో కీలకమైన బౌలర్ అని, అప్పుడు తమకు వేరే అవకాశం లేదని ఆయన చెప్పారు. ఒక సందర్భంలో షమీ, జడేజాలను పంపించాల్సిన విషయంపై సందిగ్ధత ఏర్పడిందని, అయితే కచ్చితమైన యార్కర్లు, స్లో బంతులు వేసే బుమ్రానే పంపించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 

Also Read: ఇండియా సూపర్ విన్: విలియమ్సన్ తీవ్ర అసహనం

ఇక బ్యాటింగ్ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారినే పంపిస్తారని, తాను ఆ మ్యాచులో 65 పరుగులు చేయకపోతే సూపర్ ఓవరులో బ్యాటింగ్ చేసేవాడిని కానని, తనకు బదులు శ్రేయస్ అయ్యర్ లేదా మరో బ్యాట్స్ మన్ బరిలోకి దిగేవాడని ఆయన చెప్పారు. 

click me!