సూపర్ ఓవర్ విజయంపై కోహ్లీ, రోహిత్ శర్మ స్పందన ఇదే...

By telugu teamFirst Published Jan 30, 2020, 9:40 AM IST
Highlights

మ్యాచ్ పూర్తయ్యాక గెలిచేందుకు తాము అన్ని విధాల అర్హులమని తాను కోచ్ కి చెప్పినట్లు  కోహ్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా సూపర్ చివరి బంతికి కోచ్ తో స్టంప్స్ కొట్టేది తామేనని చెప్పానని తెలిపారు. రోహిత్ రూపంలో టీమిండియాలో ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడన్నాడు. తాము ఓదశలో మ్యాచ్ పై పట్టుకోల్పాయమన్నాడు. 
 

న్యూజిలాండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో టీమిండియా చివరి నిమిషంలో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ లో 3-0 తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ పై పూర్తిగా ఆశలు కోల్పోయిన సమయంలో మహ్మద్ షమీ తన మ్యాజిక్ బౌలింగ్ తో మ్యాచ్ ను టై చేశాడు. అనంతరం సూపర్ ఓవర్ లో తన హిట్ బ్యాటింగ్ తో రెచ్చిపోగా రాహుల్ తన వంతు సహకారాన్ని అందించాడు.దీంతో... సిరీస్ టీమిండియా కైవసం చేసుకుంది. ఈ విజయంపై  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్పందించారు. 

మ్యాచ్ పూర్తయ్యాక గెలిచేందుకు తాము అన్ని విధాల అర్హులమని తాను కోచ్ కి చెప్పినట్లు  కోహ్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా సూపర్ చివరి బంతికి కోచ్ తో స్టంప్స్ కొట్టేది తామేనని చెప్పానని తెలిపారు. రోహిత్ రూపంలో టీమిండియాలో ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడన్నాడు. తాము ఓదశలో మ్యాచ్ పై పట్టుకోల్పాయమన్నాడు. 

Also Read న్యూజిలాండ్ లో తొలిసారిగా టీమిండియా ఘనత, ధోనీని దాటేసిన కోహ్లీ

షమీ వేసిన చివరి ఓవర్ ఇప్పటికీ తన  కళ్లముందు కదలాడుతోందని కోహ్లీ పేర్కొన్నాడు.  షమీ చివరి రెండు బాల్స్ డాట్ బాల్స్ వేశాక తాను సూపర్ ఓవర్ గురించి ఆలోచించానని చెప్పాడు. ఇక సూపర్‌ ఓవర్‌లో ప్రపంచంలోనే డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టుగా పేరుగాంచిన బుమ్రా బౌలింగ్‌లో విలియమ్సన్‌ బౌండరీలు రాబట్టాడని చెప్పాడు. విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సూపర్బ్‌ అని కొనియాడాడు. ఇక ఈ విజయంతో రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చొన్న నవదీపై సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యిందని కోహ్లీ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ విజయం తర్వాత రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘సూపర్‌ ఓవర్‌లో ఇంతవరకెప్పుడు బ్యాటింగ్‌ చేయలేదు. అసలేం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ముఖ్యంగా తొలి బంతి సింగిల్‌ తీసే ప్రయతంలో, మూడు, నాలుగు బంతుల తర్వాత ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అయితే చివరి రెండు బంతుల వరకు నేను ఒక్కటే అనుకున్నా బౌలర్‌ తప్పిదం చేసేవరకు వేచిచూడాలని. చివరి రెండుబంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా పరుగులు చేయలేదు. దీంతో ఈరోజు బాగా ఆడాలనుకుని సాధారణంగానే క్రీజులోకి వచ్చాను. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. అయితే ఈ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ కూడా సొంతమవుతుంది. అదే విధంగా రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు తర్వాతి మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తుందని భావించాం’అని రోహిత్‌ శర్మ అన్నాడు. 
 

click me!