న్యూజిలాండ్ లో తొలిసారిగా టీమిండియా ఘనత, ధోనీని దాటేసిన కోహ్లీ

By telugu teamFirst Published Jan 30, 2020, 9:13 AM IST
Highlights

ఇప్పటివరకూ న్యూజిలాండ్‌లో జరిగిన ఏ టీ20 సిరీస్‌నూ భారత్ గెలుచుకోలేకపోయింది.  అయితే ఈ విజయం అంత సులువుగా ఏమీ రాలేదు. రోహిత్ మెరుపులతో 179పరుగులు సాధించిన భారత్‌ను ఓ దశలో కివీస్ ఓడించేలానే కనిపించింది.
 

టీమిండియా మరో ఘనత చాటుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో కోహ్లీ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... కోహ్లీ సేన ఖాతాలో మరో రికార్డు వచ్చి  చేరింది. అలాగే కెప్టెన్ కోహ్లీ కెరీర్‌లో కూడా మరో కీర్తి చేరింది. ఎందుకంటే న్యూజిలాండ్‌లో ఆడుతూ కివీస్‌పై భారత్ గెలిచిన తొలి టీ20 సిరీస్ ఇదే. 

ఇప్పటివరకూ న్యూజిలాండ్‌లో జరిగిన ఏ టీ20 సిరీస్‌నూ భారత్ గెలుచుకోలేకపోయింది.  అయితే ఈ విజయం అంత సులువుగా ఏమీ రాలేదు. రోహిత్ మెరుపులతో 179పరుగులు సాధించిన భారత్‌ను ఓ దశలో కివీస్ ఓడించేలానే కనిపించింది.
 
ఆపై బౌలర్లు పుంజుకోవడంతో కివీస్‌ను కూడా 179పరుగులకే టీమిండియా కట్టడిచేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ ఓవర్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా రోహిత్ కీలకపాత్ర పోషించాడు. రెండు వరుస సిక్సర్లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో గెలిచి, మరో రెండు మ్యాచులు మిగిలుండగానే టీమిండియా సిరీస్ ని తన ఖాతాలో వేసుకుంది. 

Latest Videos

Also Read నన్ను కాపీ కొడుతున్నారా..? కోహ్లీ, రాహుల్ లకు చాహల్ పంచ్...

అంతేకాకుండా... ధోనీ రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు. హామిల్ట‌న్‌ టీ20లో కోహ్లీ 38 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.    భారత్‌ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ( 1112 ) పేరిట ఉంది.  తాజాగా ఆ రికార్డును  కోహ్లీ(1126) త‌న పేరిట లిఖించుకున్నాడు. 

ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో  సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1,273), న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలయమ్సన్‌(1148,  భార‌త్‌తో మూడో టీ20 ముందు వ‌ర‌కు) ఉన్నారు. దీంతో  ఓవ‌రాల్ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.  పొట్టి క్రికెట్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-10 కెప్టెన్ల జాబితాలో విరాట్ ఒక్క‌డే సుమారు 45కు పైగా అత్యుత్త‌మ స‌గ‌టుతో కొన‌సాగుతుండ‌టం విశేషం. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 107 మ్యాచ్‌ల్లో 2713 ప‌రుగులు చేశాడు. 

click me!