టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2024, 12:33 PM IST

Rohit Sharma: అంత‌ర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శ‌ర్మ మ‌రో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో 100  మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 
 


Rohit Sharma victories: భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 100 టీ20 మ్యాచ్‌లు గెలిచిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు నెల‌కొల్పాడు. వివ‌రాల్లోకెళ్తే.. దాదాపు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శ‌ర్మ‌ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో చ‌రిత్ర సృష్టించాడు. భార‌త్ విజ‌యంతో రోహిత్ శ‌ర్మ‌ 100 టీ20 మ్యాచ్‌లు గెలిచిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించిన తర్వాత హిట్ మ్యాన్ ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లండ్ ప్లేయ‌ర్ డాని వ్యాట్ (111) మాత్రమే రోహిత్ శర్మ కంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు గెలిచిన ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా మహిళల కెప్టెన్ అలిస్సా హీలీ, ఆల్‌రౌండర్ ఎలిస్సే పెర్రీ (100) కూడా ఒక్కొక్కరు 100 T20 విజయాలలో భాగమయ్యారు. పురుషుల క్రికెట్‌ విభాగంలో రోహిత్‌ శర్మ టాప్ లో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ 86 టీ20 విజయాలతో రెండో ప్లేస్ లో ఉండ‌గా, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ 73 టీ20 విజయాల్లో భాగమయ్యాడు. T20I క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాలిక్, కోహ్లీ వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు.

Latest Videos

ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మ‌న్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావ‌డం క‌ర‌క్టేనా...?

పురుషుల టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ప్లేయ‌ర్స్.. 

రోహిత్ శర్మ: 100
షోయబ్ మాలిక్: 86
విరాట్ కోహ్లీ: 73
మహ్మద్ హఫీజ్: 70
మహ్మద్ నబీ: 70

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేయ‌డంతో పాటు రెండు ఓవర్లలో 1/9 గణాంకాలను నమోదు చేసినందుకు శివమ్ దూబే టీమిండియా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. దుబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు ద‌క్కింది.

విరాట్ కోహ్లీ,యువరాజ్ సింగ్ స‌ర‌స‌న శివ‌మ్ దుబే.. స‌రికొత్త రికార్డు !

click me!